Swag Collections: ‘శ్వాగ్’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) తర్వాత హీరో శ్రీవిష్ణు  (Sree Vishnu)  , దర్శకుడు హసిత్ గోలి  (Hasith Goli) కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘శ్వాగ్’ (Swag)  . ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్  (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ (Ritu Varma)  , దక్ష నగార్కర్ (Daksha Nagarkarహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ (Meera Jasmine) , శరణ్య ప్రదీప్ (Saranya pradeep) ..లు కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ కొత్తగా ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.

Swag Collections:

కానీ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీకెండ్ ను ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ చిత్రం మొదటి సోమవారం ఇంకా బ్యాడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఒకసారి (Swag) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.37 cr
సీడెడ్ 0.09 cr
ఉత్తరాంధ్ర 0.16 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.14 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.24 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.26 cr (షేర్)

‘శ్వాగ్’ చిత్రానికి రూ.5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. 4 రోజుల్లో ఈ చిత్రం రూ.1.26 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

 ‘సత్యం సుందరం’ 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus