తెలుగు అమ్మాయిలు ఇది వరకు చేయని టాపిక్ లను ఎంచుకుని, జనాల్లోకి వెళ్లి “గర్ల్ ఆన్ ద రోడ్ ఎట్ నైట్, రోడ్డు మీద మందు పాప, వంటి షార్ట్ డాక్యుమెంటరీలతో మెప్పించిన “స్వాగిత్రి (మీరు చదివింది కరెక్ట్)” మరో అంశంతో మన ముందుకొచ్చింది. పబ్లిక్ ప్లేస్ లో ఎవరైనా చెత్తను పడేస్తే.. అలా చేయడం తప్పని చెప్పే వారుంటారా ? అనే ఉద్దేశంతో “చెత్త కథలు” అనే ప్రయోగాత్మక వీడియోను తీశారు.
స్వచ్ఛ భారత్ అంటూ నేతలు ఎంత మొత్తుకున్నా భాగ్యనగర ప్రజల్లో ఇంకా ఆ చైతన్యం వచ్చినట్లు లేదని స్వాగిత్రి చేసిన పనిలో తేటతెల్లమైంది. ఏంటి ఇంకా మీకు నమ్మకం కుదరడం లేదా? అయితే ఈ వీడియోని చూసెయ్యండీ.