Brahmamudi July 26th: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్వప్న యాడ్ వీడియో!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ రోజు రోజుకు ఎంత మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే…. ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి మొత్తానికి రాజ్ మనసు మార్చేసావు తాను నిన్ను భార్యగా అంగీకరించాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇలాగే ఉండండి అని మాట్లాడుతుంది. అయితే కావ్య మాత్రం ఇంకా తను నన్ను భార్యగా అంగీకరించలేదు ఒక సాటి మనిషిగానే చూస్తున్నారు అని చెబుతుంది.

ఈ జన్మకి తనకు నేను సాటి మనిషిగానే ఉండిపోవాలేమో అని కావ్య అనుకుంటూ ఉండగా అలా ఏం కాదు రాజ్ ను చిన్నప్పటినుంచి చూస్తున్నాము తనలో మార్పు మొదలైంది అంటూ చిట్టి కూడా మాట్లాడుతుంది. మరోవైపు అందరూ ఇంట్లో ఉపవాసం ఉండగా కళ్యాణ్ ప్రకాష్,రాజ్ మాత్రమే భోజనానికి వస్తారు. కళ్యాణ్ ఇంతమంది కోసం ఇంత వంట వండినారు మీకు పని ఎక్కువ అనిపించడం లేదా వదిన అనడంతో సాటి మనిషిగా అది నా బాధ్యత అంటూ కావ్య మాట్లాడుతుంది.

దాంతో రాజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. సాటి మనిషి ఏంటి వదిన మీరు ఈ ఇంటి మనిషి అలా మాట్లాడకండి ఇదే మాట అన్నయ్య కనుక మిమ్మల్ని అంటే మీరు ఎలా ఫీలవుతారని కళ్యాణ్ అంటాడు. చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కావ్య మాట్లాడుతుంది అయితే కావ్య ప్రవర్తన చూసినటువంటి రాజ్ బహుశా నేను అమ్మతో మాట్లాడిన మాటలు కనుక తాను వినిందా అంటూ అనుమానపడతారు. భోజనం చేసిన తర్వాత రాజ్ తన గదికి వెళ్ళగా కావ్య కూడా పైకి వెళ్లి బెడ్ తీసుకోవడం కోసం కష్టపడుతుంది.

రాజ్ తనకు హెల్ప్ చేయబోగా ఏంటి సాటి మనిషిగా చేస్తున్నారా అవసరం లేదు నేనే తీసుకుంటానని చెబుతుంది. అర్థమైంది అమ్మతో మాట్లాడిన మాటలు నువ్వు విన్నావు కదా అంటూ రాజ్ అడుగుతాడు. మీరు అలా మాట్లాడినప్పుడు నా మనసు ఎంత గాయపడిందో మీరు ఒక్కసారైనా ఆలోచించారా అంటూ మాట్లాడుతుంది. ఇక ఇద్దరు కాసేపు మాట్లాడి పడుకోగా మధ్యలో రాజ్ కి ఎక్కిళ్ళు వస్తాయి కావ్య నీళ్లు అందించగా సాటి మనిషిగా ఇస్తున్నావా అనడంతో మీరు నన్ను భార్యగా అంగీకరించకపోయినా మీరు నాకు భర్త అనడంతో రాజ్ నీళ్ళు తాగరు అప్పుడు కావ్య సాటి మనిషిగా ఇస్తున్నాం అనడంతో రాజ్ నీళ్లు తాగుతారు.

మరోవైపు స్వప్న చేసిన ఆడ్ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంది. అది చూపించిన రాహుల్ తనని పొగుడుతారు దాంతో సంతోషపడిన స్వప్న ఇది కనుక ఇంట్లో అందరూ చూస్తే నాలాంటి సెలబ్రిటీతో వాళ్లు ఉన్నందుకు ఆనందపడతారు పని మాట్లాడుతుంది. ఇక రాజ్ అయితే తన కంపెనీకి నన్నే మోడల్గా తీసుకుంటారు అంటూ సంబరపడుతుంది కానీ రాహుల్ మాత్రం ఇది కనుక ఇంట్లో వాళ్ళు చూస్తే గర్వపడటం కాదుకదా నిన్ను మాత్రం బయటకు తోస్తారు నాకు అదే కావాల్సింది అంటూ సంతోషపడుతుంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Brahmamudi) పూర్తి అవుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus