కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ తర్వాత సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. హిట్ టాక్ వచ్చి సినిమా మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సినిమాలు మంచి సినిమాలుగా పేరును సొంతం చేసుకున్నా సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోతే ప్రేక్షకులు సినిమాను ఫ్లాప్ చేస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయనే చెప్పాలి. తాప్సీ నటించిన శభాష్ మిథు సినిమాకు రెండు రోజుల్లో కేవలం 95 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమాకు కలెక్షన్లు దారుణంగా రావడం గురించి స్వర భాస్కర్ రియాక్ట్ అయ్యారు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో గుర్తింపును సంపాదించుకుని కంటెంట్ కు ప్రాధన్యత ఉన్న సినిమాలు చేస్తున్న తాప్సీ పన్ను ఈ సినిమాలతో కొన్నిసార్లు విజయాలను సొంతం చేసుకుంటుండగా మరి కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. శభాష్ మిథు సినిమా ప్రస్తుతం పరిమిత సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. నటి స్వర భాస్కర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే సినిమా విలువను డిసైడ్ చేస్తాయని నేను భావించనని తెలిపారు.
ప్రస్తుతం కల్ట్ క్లాసిక్ లుగా గుర్తింపును సొంతం చేసుకున్న సినిమాలు గతంలో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలిచాయని స్వర భాస్కర్ తెలిపారు. అదే సమయంలో కొన్ని చెత్త సినిమాలు మాత్రం హిట్ గా నిలిచాయని స్వర భాస్కర్ చెప్పుకొచ్చారు. అందువల్లే నేను ఈ విధంగా భావిస్తున్నానని స్వర భాస్కర్ అన్నారు.
శభాష్ మిథు ట్రైలర్ నాకు ఎంతగానో నచ్చిందని ఆమె కామెంట్ చేశారు. ఈ వారం థియేటర్ లో ఈ సినిమాను చూస్తానని ఆమె చెప్పుకొచ్చారు. స్వర భాస్కర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.