బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం ‘స్వాతి ముత్యం’.నూతన దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 5న విజయదశమి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అదే రోజు ‘గాడ్ ఫాదర్’ ‘ఘోస్ట్’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా పై అందరి దృష్టి పడింది.
ఓ చిన్న సినిమాని ఏ ధైర్యంతో రెండు పెద్ద సినిమాల మధ్య దింపుతున్నారు అనే ప్రశ్నతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పొచ్చు.అయితే ఈ చిత్రానికి బిజినెస్ మాత్రం అంతంత మాత్రమే జరిగింది. కానీ సినిమాకైన బడ్జెట్ రీత్యా ఇది ఎక్కువ బిజినెస్ అని ఇన్సైడ్ టాక్. ఒకసారి థియేట్రికల్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం
1.50 cr
సీడెడ్
0.60 cr
ఉత్తరాంధ్ర
0.70 cr
ఈస్ట్
0.22 cr
వెస్ట్
0.20 cr
గుంటూరు
0.27 cr
కృష్ణా
0.23 cr
నెల్లూరు
0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్
0.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.84 cr
‘స్వాతి ముత్యం’ చిత్రానికి రూ.3.84 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పోటీగా ‘గాడ్ ఫాదర్’ ‘ది ఘోస్ట్’ వంటి బడా చిత్రాలు ఉన్నాయి.