మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న స్వాతిముత్యం సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 11 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నాన్ థియేట్రికల్ హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. రిస్క్ తక్కువగా ఉండటంతో మేకర్స్ ఈ సినిమాను దసరా పండుగకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే స్వాతిముత్యం రిలీజ్ డేట్ బెల్లంకొండ సురేష్ కు మాత్రం నచ్చలేదని బోగట్టా.
అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడం వల్ల గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలలో ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా స్వాతిముత్యం సినిమాకు నష్టం కలుగుతుందని బెల్లంకొండ సురేష్ ఫీలవుతున్నారని తెలుస్తోంది. స్వాతిముత్యం సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోతే సినిమా రిజల్ట్ పై ప్రభావం పడుతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది. బుధవారం రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుండటం కూడా ఈ సినిమా బెల్లంకొండ సురేష్ ను టెన్షన్ పెడుతోంది.
మరో రిలీజ్ డేట్ ను ఎంచుకుంటే మాత్రం ఈ సినిమాకు బెటర్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బెల్లంకొండ గణేష్ కెరీర్ ఒక విధంగా ఈ సినిమాపైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. గణేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చి స్వాతిముత్యం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా చిన్న సినిమాలలో పెద్ద హిట్ గా నిలుస్తుంది.
ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలేవీ సక్సెస్ సాధించకపోవడంతో టాలీవుడ్ బయ్యర్లు దసరా పండుగకు రిలీజ్ కానున్న సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు. దసరాకు రిలీజ్ కానున్న సినిమాలు 250 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.