Swathimuthyam: ఆకట్టుకుంటున్న ‘స్వాతిముత్యం’ టీజర్ ట్రైలర్..!

బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘వర్ష బొల్లమ్మ’ హీరోయిన్ గా నటిస్తుంది. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఈరోజు హీరో గణేష్ పుట్టినరోజు కావడంతో టీజర్ ట్రైలర్ పేరుతో ఓ వీడియో ప్రోమోని విడుదల చేశారు. 40 సెకన్ల నిడివి గల ఈ ప్రోమో చాలా ఫన్ తో కూడుకుని ఉంది.

” మన బాలూ ఏం చేసాడో కొంచెం నీకర్థమయ్యేలా చెబుతాను…” అంటూ వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత హీరోయిన్ వర్ష బొల్లమ్మ హీరో గణేష్ ని “చెప్పండి..అంటే” ….. హీరో గణేష్ ‘అదీ’ అంటూ కంగారు పడటం ఆ తర్వాత అయోమయానికి గురవ్వడం…. హీరోకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పకనే చెప్పింది ఈ ప్రోమో.చివర్లో ‘మీరింకా సింగిల్ గా ఎందుకుండిపోయారో నాకిప్పుడర్ధమయింది” అంటూ హీరోయిన్ చెప్పడంతో

సినిమాలో ఏదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందని క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. రావు రమేష్, వెన్నెల కిషోర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే విడుదల కానుంది. ఇక సినిమా దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్షవర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద వంటి వారు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ టీజర్ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus