Swetaa Varma: ‘బిగ్ బాస్’ బ్యూటీ శ్వేతా వర్మకి ఎదురైన చేదు అనుభవం అదేనట..!

‘బిగ్ బాస్5’ లో ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో గేమ్ ఆడి అందరికీ దగ్గరయ్యింది శ్వేతా వర్మ. తన ముక్కుసూటితనం వల్లో లేక తన కోపం వల్లో ఏమో కానీ.. ఆమె ఎక్కువ రోజులు హౌస్లో కొనసాగలేకపోయింది. నిజానికి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ‘కళ్యాణ వైభోగం’ ‘పచ్చీస్’ ‘మితాయ్’ ‘ఏకమ్’ వంటి సినిమాల్లో నటించింది. ఇక ‘బిగ్ బాస్’ నుండీ ఎలిమినేట్ అయినప్పటి నుండీ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆమె బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఆమె సినీ కెరీర్ గురించి అలాగే క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. శ్వేతా వర్మ మాట్లాడుతూ… “ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నాతో అసభ్యకరంగా మాట్లాడేవారు.మా సినిమాలో ఛాన్స్ ఇస్తాం… పారితోషికం ఎంతైనా ఇస్తాం..మాకు కమిట్మెంట్ ఇస్తారా? అంటూ అడిగేవారు. కమిట్మెంట్ అంటే నాకు అర్ధం తెలిసేది కాదు. కానీ తర్వాత దానికి వేరే అర్ధాలు ఉంటాయని తెలిసింది.ఒకరోజు నాకో వ్యక్తి ఫోన్ చేసి ఓ యాడ్ షూటింగ్ ఉంది,

రూ.1 లక్ష వరకు పారితోషికం ఇస్తాం.కానీ మాకు సహకరించాల్సి ఉంటుంది. ఇది 2015లో జరిగింది. ‘అతను నాతో అలా మాట్లాడటం నాకు చాలా కోపం తెప్పించింది. ‘అదే లక్ష నేను మీకు ఇచ్చి ఎతైన బిల్డింగ్ మీద నుండీ దూకమంటే.. దూకుతారా..?’ అని ఎదురు ప్రశ్న వేసాను.దానికి ఆ వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. నా ట్యాలెంట్‌ను మాత్రమే నమ్ముకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ‘బిగ్ బాస్’ తర్వాత నాకు సినిమాల్లో అలాగే వెబ్ సిరీస్‌లలో ఛాన్స్‌లు వస్తున్నాయి” అంటూ చెప్పుకొచ్చింది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus