మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న(నిన్న) విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రకి మెగాస్టార్ వందకు వంద శాతం న్యాయం చేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్.. అద్భుతంగా వచ్చింది అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి కానీ మిగిలిన భాషల్లో మాత్రం కలెక్షన్లు చాలా పూర్ గా ఉన్నాయి.
ఇక ‘సైరా నరసింహారెడ్డి’ 12 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
26.31 cr
సీడెడ్
17.21 cr
ఉత్తరాంధ్ర
11.64 cr
ఈస్ట్
8.18 cr
వెస్ట్
6.23 cr
కృష్ణా
7.19 cr
గుంటూరు
9.20 cr
నెల్లూరు
3.96 cr
ఏపీ + తెలంగాణ
89.92 cr
రెస్ట్ అఫ్ ఇండియా
21.21 cr
ఓవర్సీస్
13.35 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
124.28 cr (షేర్)
‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 124.28 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఇంకా ఈ చిత్రం 76 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అద్భుతంగా కలెక్ట్ చేస్తుంది.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఓవర్సీస్ లో కానీ హిందీ,తమిళ, మలయాళం భాషల్లో ఈ చిత్రం కలెక్షన్స్ అస్సలు లేవనే చెప్పాలి. దసరా సెలవులు దాదాపు పూర్తయ్యాయి. ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలుకానుంది. ఫుల్ రన్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవని ట్రేడ్ పండితులు తేల్చేశారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.