మెగాస్టార్ 151 వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో అయన కొడుకు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. స్టార్ క్యాస్ట్ కూడా భారీగానే ఉంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందట. అయితే ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మే నెలకే పూర్తి చెయ్యమని చరణ్ సురేందర్ రెడ్డి అండ్ టీం కు ఎప్పుడో డెడ్ లైన్ పెట్టాడట. ఎందుకంటే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం పడుతుంది. 1840 బ్యాక్ డ్రాప్ కాబట్టి చాలా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది అందుకే చరణ్ ఇలా డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలో చిత్ర బృందం ఓ నిర్ణయానికి వచ్చిందట. సినిమా షూటింగ్ సమయంలోనే ప్రాధాన్యం లేని సన్నివేశాల్ని తొలగించాలని భావిస్తున్నారట. దీంతో షూటింగ్ దశలో ఉండగానే ఎడిటింగ్ వర్క్ కూడా సమానంగా జరిగిపోతున్నామాట. దీంతో డబ్బు, సమయం రెండూ కలిసొస్తాయని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి చరణ్ కూడా ఓకే చెప్పాడట. ఇక ఆడియో పరంగా కూడా 5 పాటలుండగా… సినిమాలో మాత్రం 4 పాటలే ఉంటాయని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. ఏదేమైనా పెద్ద సినిమా అంటే ఇలాంటి రిపేర్లు తప్పవు మరి..!