ఈ ఏడాది ఆరు నెలలు మాత్రమే పూర్తి అయింది. ఇంకా ఆరునెలలు పాటు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. కానీ వచ్చే ఏడాది కీలమైన సీజన్స్ లో డేట్స్ ని స్టార్ హీరోలు ఫిక్స్ చేసుకుంటున్నారు. సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో చెర్రీ చేస్తున్న మూవీ జనవరి 12 న రిలీజ్ అవుతుందని నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించారు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీ పెద్ద పండుగకు సందడి చేయనుంది. వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీ కూడా అప్పుడే రాబోతోంది. ఈ పోటీలో తనెందుకని మహేష్ బాబు ముందుగా వేసవికి బెర్త్ ఖరారు చేసుకున్నారు. ఉగాదిని పురస్కరించుకొని ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది. దిల్ రాజు అప్పుడు తేదీని ఇప్పుడే ప్రకటించడం వెనుక బలమైన కారణం ఉంది.
అదే టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు. అందులో ఒకటి ప్రభాస్ సాహో. రెండోది మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి. ఈ రెండింటికి హాలీవుడ్ టెక్నీషన్లు పనిచేస్తున్నారు. ఆడియన్స్ కి ఇందులోని యాక్షన్ సీన్స్ థ్రిల్ చేయనున్నాయి. వేసవి సీజన్లో రిలీజ్ చేస్తేనే ఎక్కువగా కలక్షన్స్ రాబట్టగలమని ఆ చిత్రాల నిర్మాతలు ఫిక్స్ అయ్యారంట. సో వాటి మధ్యలో పోయి నలిగి పోవడం కంటే ముందుగానే డేట్ ప్రకటించి మహేష్ 25 వ మూవీ నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఇక సాహో, సైరా సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలోనే గట్టి చర్చ జరగనుంది. ఈ చిత్రాల మధ్య గ్యాప్ ఉంటుందా? ఒకే రోజు రిలీజ్ అవుతాయా? అనేది ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయింది.