Sai Dharam Tej: మెగా ఫ్యామిలీ నాకు ఎలాంటి సహాయం చేయలేదు!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆ ప్రమాదం జరిగిన సమయంలో సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి అక్కడే ఉండగా వెంటనే సాయి ధరమ్ తేజ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఇలా ఈయన వెంటనే రెస్పాండ్ కావడం సరైన సమయానికి హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో సాయిధరమ్ తేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పాలి.ఇలా సాయి ధరమ్ తేజ్ ను కాపాడటంతో సయ్యద్ అబ్దుల్ మెగా కుటుంబం నుంచి భారీగానే లాభం పొంది ఉంటారని అందరూ భావించారు.

ఇక సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) తాజాగా నటించిన విరూపాక్ష సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ విషయం గురించి మాట్లాడుతూ తన ఫ్యామిలీ తనకు ఎలాంటి డబ్బు సహాయం చేసిందో నాకు తెలియదు కానీ నేను మాత్రండబ్బులు ఇచ్చి తన మానవత్వానికి విలువ కట్టలేను. అందుకే తనని కలిసి నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఎలాంటి సమయంలో సహాయం కావాలన్నా నన్ను సంప్రదించమని చెప్పాను అంటూ తెలియచేశారు.ఇలా సాయి ధరమ్ తేజ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీడియా సయ్యద్ అబ్దుల్ ను సంప్రదించండి.

ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ చేసిన కామెంట్లపై సయ్యద్ అబ్దుల్ స్పందిస్తూ తనను సాయి ధరమ్ తేజ్ కలవలేదని తెలిపారు.అలాగే మెగా ఫ్యామిలీ నుంచి నాకు ఏ విధమైనటువంటి సహాయం కూడా అందలేదని ఎవరు నాకు ఫోన్ నెంబర్లు ఇవ్వలేదని తెలిపారు. ఇక మెగా ఫ్యామిలీ నాకు డబ్బు సహాయం చేసింది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను పని చేసే చోట ఇతర కొలీగ్స్ అలాగే తమ బంధువులు ఎంత డబ్బు తీసుకున్నావు ఇంకా ఎలాంటి సహాయం చేశారనీ తనని టార్చర్ పెడుతున్నారు.

ఇలా వీరందరి టార్చర్ భరించలేక తాను సీఎంఆర్ లో పనిచేయడం కూడా మానుకున్నానని, ఇలా పని కోల్పోయి ఆర్థిక కష్టాలను కూడా ఎదుర్కొన్నానని సయ్యద్ అబ్దుల్ పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీ నాకు ఏ విధమైనటువంటి సహాయం చేయలేదు బహుశా ఇప్పుడు నాకు సాయి ధరమ్ తేజ్ ఫోన్ చేస్తే వెళ్తానని తెలియజేశారు.ఇలా సాయి ధరమ్ తేజ్ తనుకు నంబర్ ఇవ్వలేదని తనని కలవలేదంటూ సయ్యద్ అబ్దుల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus