Taapsee Pannu: అనంత్ అంబానీ వివాహంపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో తాప్సీ (Taapsee Pannu) ఒకరు కాగా చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ బ్యూటీ నిలుస్తూ ఉంటారు. తాప్సీ అనవసర వివాదాలలో తలదూర్చడం ఆమె అభిమానులకు సైతం అస్సలు నచ్చదు. తాజాగా తాప్సీ అనంత్ అంబానీ పెళ్లికి తాను హాజరు కాకపోవడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అనంత్ అంబానీ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మహేష్ బాబు (Mahesh Babu) , రామ్ చరణ్ (Ram Charan), మరి కొందరు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కావడం జరిగింది. ఈ పెళ్లి కోసం 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఈ మొత్తం అంబానీ సంపాదనలో కేవలం 0.5 శాతం కావడం గమనార్హం. ముకేశ్ అంబానీ మొత్తం సంపాదన ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.

అనంత్ రాధిక పెళ్లికి హాజరు కాకపోవడం గురించి తాప్సీ స్పందిస్తూ నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదని ఆమె అన్నారు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నదని తాప్సీ పేర్కొన్నారు. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒకరకమైన అనుబంధం ఉండాలని నేను ఫీలవుతానని ఆమె కామెంట్లు చేశారు. అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతానని తాప్సీ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్న తాప్సీ అనవసర వివాదాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తాప్సీ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత తాప్సీ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వో లడ్కీ హై కహాన్, ఫిర్ అయీ హసీనా దిల్ రుబా, ఖేల్ ఖేల్ మే సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాల రిలీజ్ డేట్ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus