Taapsee Pannu: తాప్సీ బాగానే నెట్టుకొస్తోంది!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే కెరీర్ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు ఒక్క ఫ్లాప్ వస్తే కెరీర్ అమాంతం కిందకు పడిపోతుంది. కానీ కొందరికి మాత్రం ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. అవకాశాలు వస్తూనే ఉంటాయి. 2010లో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ బిజీగా మారింది. ఇటీవల ‘శెభాష్ మిథు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాప్సీ.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా దెబ్బతిందో తెలిసిందే. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం రూ.4 కోట్లను కూడా రాబట్టలేకపోయింది. అంతకముందు ఆమె తెలుగులో చేసిన ‘మిషన్ ఇంపాజిబుల్’ కూడా వర్కవుట్ కాలేదు. అలానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘లూప్ ల పేటా’ సినిమాకి కూడా సరైన రెస్పాన్స్ రాలేదు. ‘రష్మీ రాకెట్’, ‘అనాబెల్లె సేతుపతి’ ఇలా ఆమె నటించిన ఏ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు.

ఇవన్నీ ఓటీటీలో వచ్చాయి కాబట్టి సరిపోయింది లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇన్ని ప్లాప్స్ వచ్చినా.. తాప్సీ కెరీర్ కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా ఆమెకి కొన్ని భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వస్తున్న ‘డుంకీ’ ఉంది. అలానే అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తోన్న ‘దొబరా’ సినిమా కూడా ఒప్పుకుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ‘బ్లర్’, ‘ఓ లడికీ కహా హై’ వంటి సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. తమిళంలో ‘ఏలియన్’, ‘జనగణమన’ సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పటికీ.. నిర్మాతగా కూడా సినిమాలు చేస్తోంది. త్వరలోనే సమంత హీరోయిన్ గా తాప్సీ ప్రొడక్షన్ లో ఓ సినిమా మొదలుకానుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus