రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి తాప్సీ. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం తెలుగులో పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన తాప్సీ అనంతరం ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్న తాప్సీ కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా మెప్పించారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈమె తరచూ ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి గురించి వారి పట్ల చూపే వివక్షత గురించి గళం విప్పుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చే 12 సంవత్సరాలు పూర్తి అయిందని అయితే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ల పట్ల మహిళల పట్ల అదే వివక్షత ఉందని ఏ మాత్రం మార్పు లేదని తెలిపారు.
రెమ్యూనరేషన్ నుంచి మొదలుకొని హీరోయిన్ కి హెల్పర్స్ అకామిడేషన్ వంటివన్నీ కూడా హీరోల కన్నా చాలా తక్కువగానే ఉంటాయని హీరోలతో పోలుస్తూ హీరోయిన్లను తక్కువ చూపు చూస్తున్నారని వెల్లడించారు. ఇకపోతే తాను నిర్మాతగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వివక్షత లేకుండా చూస్తానని ఈమె తెలిపారు. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఇద్దరికీ సమానత్వం ఉండేలా తాను చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ ఆమె నిర్మాతగా మారి ఔట్‌సైడర్స్ ఫిలింస్ అనే సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్‌లో బ్లర్, ధక్ ధక్ అనే రెండు మూవీస్ నిర్మిస్తున్నది.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?