టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో మంచి పేరు, గుర్తింపును సొంతం చేసుకున్న తాప్సీ పలు సందర్భాల్లో ట్రోల్స్ ద్వారా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నారు. అయితే పలు సందర్భాల్లో ఈ ట్రోల్స్ హద్దులు దాటుతుండటంతో తాప్సీ (Taapsee Pannu) సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. టార్గెట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తే అస్సలు సహించనని ఆమె పేర్కొన్నారు. సినిమాలు ఫ్లాపైన సమయంలో ఆ సినిమాలలో నటించిన నటీనటులపై ట్రోల్స్ రావడం సాధారణం అని తాప్సీ తెలిపారు.
అయితే సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాదని అది టీమ్ వర్క్ అని గుర్తు పెట్టుకోవాలని తాప్సీ పేర్కొన్నారు. పబ్లిక్ లైఫ్ లో ఉన్న సెలబ్రిటీల గురించి ట్రోల్స్ సాధారణం అని ఆమె అన్నారు. తాను పబ్లిక్ ఫిగర్ నే కానీ పబ్లిక్ ప్రాపర్టీని కాదంటూ తాప్సీ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఉన్న రంగంలో ట్రోల్స్ కు అలవాటు పడాల్సిందేనని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఆ పనిని ఎప్పుడో చేశానని తాప్సీ పేర్కొన్నారు.
ట్రోల్స్ చేసేవాళ్లు మా కొరకు విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారనేది నా ఫీలింగ్ అని తాప్సీ అభిప్రాయపడ్డారు. కాకపోతే ఒక చిన్న తేడాను గమనించాలని నేను పబ్లిక్ ఫిగర్ నే తప్ప ప్రాపర్టీని మాత్రం కాదని తాప్సీ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ట్రోల్స్ ప్రభావం కెరీర్ పై అస్సలు ఉండదని ఆమె తెలిపారు.
గతంలో ఇవి కెరీర్ పై ఎఫెక్ట్ చూపడం వాస్తవమే అయినా ప్రస్తుతం వీటి ప్రభావం మాపై తక్కువ అని కెరీర్ కు కెమెరా ముందు ఏ విధంగా ఉన్నాం అనేది మాత్రమే ముఖ్యమని తాప్సీ తెలిపారు. తాప్సీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. పర్సనల్ గా విమర్శలు చేసినా, భౌతికంగా మీద పడినా అస్సలు సహించనని ఆమె పేర్కొన్నారు.