Puri Jagannadh, Teja Sajja: ‘హనుమాన్’ బ్యాచ్ తో పూరి సినిమా..!
- August 23, 2024 / 02:17 PM ISTByFilmy Focus
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్'(Double Ismart).. ప్రేక్షకులను రంజింపజేయలేకపోయింది.ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. పూరి జగన్నాథ్ నుండి యూత్..మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కానీ అలీ (Ali) కామెడీ ట్రాక్ వంటివి కొన్ని పండలేదు. అందువల్ల ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకుల నుండి ఎక్కువ మార్కులు వేయించుకోలేకపోయింది. మరోపక్క ‘ఇస్మార్ట్ శంకర్’ తో (iSmart Shankar) పోల్చి కూడా కొంత మంది ప్రేక్షకులు ‘డబుల్ ఇస్మార్ట్’ ను చిన్నచూపు చూశారు.
Puri Jagannadh, Teja Sajja

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది. సో బయ్యర్స్ కి తీవ్రంగా నష్టాలు వాటిల్లాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్ ను దాదాపు రూ.54 కోట్లతో ‘హనుమాన్’ (Hanuman) నిర్మాత నిరంజన్ రెడ్డి దక్కించుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ క్రేజ్ వల్ల ఆయన అంత మొత్తం పెట్టేసారు. ఇప్పుడు నష్టాలు రావడంతో.. దర్శకుడు పూరి జగన్నాథ్, ఓ సినిమా చేసి పెడతానని మాటిచ్చారట.

తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయే ఓ కథని పూరి ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. నిరంజన్ రెడ్డి వద్ద తేజ సజ్జ (Teja Sajja) డేట్స్ ఉన్నాయి. ‘హనుమాన్’ తో అతని మార్కెట్ కూడా పెరిగింది. సో పూరి దర్శకత్వంలో తేజ సజ్జ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమాకి బిజినెస్ బాగా జరిగి లాభాలు వస్తే.. అందులో వాటా తీసుకుంటానని కూడా పూరి జగన్నాథ్.. నిర్మాత నిరంజన్ రెడ్డికి చెప్పారట.















