Taapsee Pannu: స్టార్ హీరోయిన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి.!

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కూడా ఊహించని కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి వాటిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా టాప్ ఆర్డర్ లో ఉంటుంది. ఈమె టంగ్ పవర్ కు తోటి బాలీవుడ్ స్టార్స్ అంతా భయపడతారు అనడంలో అతిశయోక్తి లేదు. పొరపాటున ఈమెను కెలికితే మాత్రం ఘోరంగా అవమానించడానికి కనిపెట్టుకుని ఉంటుంది.మన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ను కూడా ఈమె వదల్లేదు అంటే అర్థం చేసుకోవచ్చు.

ఇక కంగనా- తాప్సీ ల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాప్సి తాజాగా కంగనా పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాప్సి మాట్లాడుతూ.. ” నిజానికి కంగనతో నాకు ఎలాంటి సమస్య లేదు. ఆమె నాకు ఎప్పుడు ఎదురైనా పలకరించడానికి వెనుకాడను. కంగనా సోదరి రంగోలీ చందేల్ నన్ను ‘బి-గ్రేడ్’ అంటే.. కంగన కూడా ‘చీప్’ అని పిలిచింది. అయినా దాని గురించి నేనేం బాధపడలేదు.

నిజం చెప్పాలంటే వాటికి అర్థం ఏంటో కూడా నాకు తెలియదు. నేను ఇప్పుడు పరిశ్రమలో ఉన్నాను కాబట్టి అతిథులను పలకరించడం, హలో, ధన్యవాదాలు చెప్పడం వంటివి సహజంగానే పాటిస్తా.అలాగే కంగనా ఎదురైతే దూరంగా వెళ్లను. ఎందుకంటే నాకు ఆమెతో ఎటువంటి సమస్య లేదు. కానీ, ఆమెనే ఒక సమస్యగా తయారయ్యింది.

మొదట్లో ఆమె కోరికలు చూసి నేను ఆశ్చర్యపోయాను. నన్ను చౌక అని పిలిచినప్పుడు కూడా నేనేమీ ఇబ్బంది పడలేదు. ఎందుకుంటే కంగనా గొప్ప నటి. కాబట్టి నేను దాన్ని అభినందనగా తీసుకోగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus