డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) , ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సినిమా పెద్ద హిట్టు. ఆ సినిమా తర్వాత రామ్ ‘రెడ్’ (RED) ‘ది వారియర్’ (The Warriorr) ‘స్కంద’ (Skanda) వంటి సినిమాల్లో నటించాడు. ఇందులో ‘రెడ్’ పర్వాలేదు అనిపించినా మిగిలిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరోపక్క పూరి తెరకెక్కించిన ‘లైగర్’ (Liger) కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. సో వీరిద్దరికీ ఓ బలమైన హిట్ కావాలి. అందుకోసమే ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చేశారు.
టీజర్, పాటలు వంటివి మంచి రెస్పాన్స్ నే రాబట్టుకున్నాయి. సినిమా పై బజ్ ఏర్పడేలా చేశాయి. అందువల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూ.90 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. అటు రామ్ కెరీర్లో, ఇటు పూరి కెరీర్లో.. ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీనే. క్రేజీ మూవీకి సీక్వెల్ కావడంతో డిజిటల్ రైట్స్ అన్ని భాషలతోనూ కలుపుకుని రూ.33 కోట్లకి అమ్ముడయ్యాయట.
ఆడియో రైట్స్ రూ.7 కోట్ల వరకు తెచ్చిపెట్టినట్టు వినికిడి. ఇక థియేట్రికల్ రైట్స్ రూ.53 కోట్ల వరకు జరిగింది. హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో బేరసారాలు జరుగుతున్నాయి. మేకర్స్ రూ.23 అంటున్నారు, వాళ్ళు రూ.20 చెబుతున్నారు. పోనీ రూ.20 కి ఫిక్స్ అనుకున్నా రూ.110 కోట్ల మార్క్ చేరుకున్నట్టే. సో టేబుల్ ప్రాఫిట్స్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ అవుతున్నట్టే అని చెప్పాలి.