ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ నుంచి సినిమా వస్తోంది అంటే ఓ వర్గం జనాలు ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. వర్మ ఎలాంటి సినిమా తీసినా కూడా అందులో ఎదో ఒక యూనిక్ పాయింట్ హైలెట్ అయ్యేలా ఉంటుంది. ఆయన ప్లాప్ సినిమాలు కూడా ప్రయోగాలే. అయితే అదంతా కూడా రక్త చరిత్ర, వంగవీటి వరకే వర్కౌట్ అయ్యింది. ఆ తరువాత వచ్చిన ఏ సినిమా కూడా వర్మ మార్క్ ను అందుకోలేదు కదా.. మేకింగ్ లో కూడా ఏ మాత్రం కొత్తదనం లేదనే టాక్ వస్తూనే ఉంది.
వర్మ ట్వీట్ వేసినంత తెలివిగా , సెటైర్ వేసినంత లాజిక్ గా సినిమాలను తెరకెక్కించలేకపోతున్నాడు అనే రివ్యూలు చాలానే వస్తున్నాయి. ఆయన మాటలకు ఫాలో అయ్యే ఫ్యాన్స్ కూడా సినిమాలను చూడడం లేదనే చెప్పాలి. ఇక RGV ఇటీవల పాన్ ఇండియా ఓటీటీ అంటూ స్పార్క్ అనే యాప్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ అగ్ర స్టార్స్ నుంచి టాలీవుడ్ బ్రహ్మానందం వరకు అందరూ కూడా ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని గట్టిగానే ప్రమోట్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వర్మ కోసం ఓ వీడియో బైట్ కూడా ఇచ్చాడు.
అయితే ఇప్పటివరకు ఆ యాప్ ను కనీసం లక్ష మంది కూడా ఇన్ స్టాల్ చేసుకోకపోవడం ఆశ్చర్యం. యాప్ ప్రమోషన్ కోసం షార్ట్ ఫిలిమ్స్ కంటెస్టెంట్ అంటూ ప్రైజ్ మనీ కూడా ఎనౌన్స్ చేశాడు. అందులో ఎంతమంది పాల్గొన్నారో వారికే తెలియాలి. ఇక అన్నిటికంటే పెద్ద దెబ్బ ఈ రోజుల్లో ఓటీటీ కంటెంట్ ఎంత సెక్యూరిటీతో ఉన్నా ఈజీగా పైరసీ చేసి టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో సింగిల్ క్లిక్కుతో డౌన్ లోడ్ చేసుకునే పైరసీ లింక్స్ వస్తున్నాయి. అందుకే జనాలు ఎక్కువగా ఓటీటీ యాప్స్ కు డబ్బులు పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఇక ఆ కోవాలో కూడా దెబ్బ తిన్న వర్మ SPARK యాప్, ఆయన సినిమాలనే ప్లే స్టార్ మరుగున పడిపోతోంది.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!