మూడోసారి ప్రభాస్ పక్కన నటించనున్న తమన్నా
- May 3, 2017 / 08:01 AM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న సాహో కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మిక మందనా నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపిస్తోంది. తమన్నా, ప్రభాస్ తో కలిసి రెబల్ సినిమాలో నటించింది. అది నిరాశపరిచినప్పటికీ బాహుబలి బిగినింగ్ లో ఈ జంట అందరి మనసులను దోచుకుంది.
ప్రభాస్ తో సమానంగా యాక్షన్ సీన్స్ లో మిల్కీ బ్యూటీ అదరగొట్టింది. సో పక్కా యాక్షన్ మూవీ అయిన సాహోలో తమన్నా అయితే బాగుంటుందని ఫైనల్ గా ఆమెను ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ కి జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















