స్టార్ హీరోల గురించి తమన్నా ఆసక్తికర కామెంట్లు.!
- April 19, 2018 / 01:24 PM ISTByFilmy Focus
దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా బాహుబలి సినిమాల తర్వాత వేగాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ క్వీన్ రీమేక్ మూవీ తో పాటు కళ్యాణ్ రామ్ సరసన నా నువ్వే సినిమాలు మాత్రమే చేస్తోంది. రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఈమెను.. ఎందుకు వేగం తగ్గించారని అడగగా.. మంచి పాత్రలకు ఎదురుచూసి అవకాశాలు వదులుకున్నట్టు తెలిపింది. మరి తెలుగు చిత్ర పరిశ్రమలో మీరు నటించిన హీరోల గురించి చెప్పమని కోరగా.. వరుసగా మనసులోని మాటను బయట పెట్టింది. “ప్రభాస్ తో రెండు సినిమాలు చేశాను. అందరినీ డార్లింగ్ అంటూ నవ్వుతూ పలకరిస్తాడు.
ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. తను మాత్రమే కాదు, చుట్టూ ఉన్నవారిని కూడా నవ్విస్తూ ఉంటాడు. ఆయనతో ఎలాంటి రహస్యాలనైనా పంచుకోవచ్చు” అని డార్లింగ్ గురించి వెల్లడించింది. ఇక మహేష్‌బాబు గురించి మాట్లాడుతూ.. “ఆయన్ని సూపర్‌స్టార్ అని ఎందుకంటారో ఆయనతో పనిచేస్తేనే తెలుస్తుంది. ఆయన దృష్టి అంతా ఎప్పుడూ పనిమీదే ఉంటుంది. తోటి నటీనటులతో గౌరవంగా ఉంటారు” అనే వివరించింది. “ఎన్టీఆర్‌తో పోటీ పడి డాన్స్ చేయడం కష్టమే. ఆయనతో స్టెప్పులు వేయాలంటే రెండు మూడు సార్లన్నా ప్రాక్టీసు చేయాల్సిందే. ఆయనకైతే ఒక్కసారి చెబితే చాలు వెంటనే చేసేస్తారు” అంటూ తమన్నా అభినందనలు కురిపించింది.















