‘బిగ్ బాస్ 3’ లో కొత్త అటెంప్ట్… నిజమేనా?

మొదటి వారం నటి హేమ ఎలిమినేట్ అయిన రోజునే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ‘ట్రాన్స్ జెండర్’ తమన్నా సింహాద్రి ను హౌస్ లోకి పంపించారు ‘బిగ్ బాస్3’ యూనిట్. నిజానికి ఇదొక కొత్త పరిణామం. చాలా మంచి ఆలోచన కూడా. ఎంతో మంది ట్రాన్స్ జెండర్ల కు ప్రోత్సహించే అంశం. దీంతో ‘బిగ్ బాస్’ ప్రేక్షకులే కాదు.. తెలుగు ప్రజలంతా ‘బిగ్ బాస్’ ను అభినందించారు. హౌస్లోకి ఎంటరైన తమన్నా మొదటి రెండు, మూడు రోజులు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మాత్రం ఆమె కాస్త అదుపు తప్పినట్టు కనిపించింది. మొదటగా అలీ తో ఆమె గొడవ పెట్టుంది. చిన్న కారణానికే ఆమె పెద్ద రచ్చే చేసింది. అయితే తర్వాత ఇద్దరూ సారీలు చెప్పుకుని రాజీపడ్డారు. వీకెండ్లో హోస్ట్ నాగార్జున వచ్చినప్పుడు కూడా తమన్నా కొంచెం పర్వాలేదనిపించింది.

కానీ మొదటి సోమవారం బహిరంగంగా ఎలిమినేషన్ నిర్వహించాడు ‘బిగ్ బాస్’. ఈ క్రమంలో కంటెస్టెంట్ రవి కృష్ణ కారణాలు చెప్పి తమన్నాని నామినేట్ చేశాడు. ఇక అందుకు గాను రవి కృష్ణను తమన్నా ఘోరంగా తిట్టి పోస్తుంది. మిగిలిన హౌస్ మేట్స్ ఎంత నచ్చ చెప్పినా ఆమె వినట్లేదు. చెప్పే కొద్దీ రెచ్చిపోతుంది. అలాగే ఈ క్రమంలో రాహుల్, అలీ వంటి వారు గట్టిగా చెప్పినా వారిని కూడా తిట్టిపోస్తుంది. రవికృష్ణ కి, హౌస్ మేట్స్ కు మాత్రమే కాదు ప్రేక్షకులకి కూడా ఆమె ప్రవర్తన విరక్తి పుట్టిస్తుంది. ఎంతో మంది ట్రాన్స్ జెండర్లకు రోల్ మోడల్ గా నిలుస్తుంది అనుకుంటే.. ‘తాను దిగజారిపోవడమే కాకుండా… అందరినీ దిగజార్చే’ పరిస్థితి తీసుకొస్తుంది తమన్నా. దీంతో ఆమెను వారం చివరి వరకూ కూడా ‘బిగ్ బాస్3’ హౌస్ లో ఉంచే పరిస్థితి లేదని వార్తలు వినిపిస్తున్నాయి. వీకెండ్ పూర్తయ్యాక గౌరముగా ఎలిమినేషన్ జరిగే పరిస్థితి తమన్నా విషయంలో జరిగేలా లేదంట. హద్దులు మీరు ప్రవర్తిస్తున్న కారణంగా ఆమెను మిడ్ వీక్ లోనే ఎలిమినేట్ చేయబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇలా గనుక జరిగితే ‘బిగ్ బాస్’ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టే. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus