మెగాస్టార్ చిరంజీవి నుండి ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకు… మధ్యలో మెగా బాబాయ్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తమన్నా సినిమాలు చేసింది. విక్టరీ వెంకటేష్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ హీరోల్లో రామ్, నాగచైతన్య, సందీప్ కిషన్, సుశాంత్ తదితరులతోనూ సినిమాలు చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలలో దాదాపుగా అందరితోనూ సినిమాలు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు రూటు మార్చింది. కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. చిన్న హీరోల పక్కన సినిమాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ప్రజెంట్ తమన్నా రెండు తెలుగు సినిమాలు చేస్తోంది. గోపీచంద్ సరసన ‘సిటిమార్’లో మిల్కీ బ్యూటీ హీరోయిన్. అది కాకుండా ‘గుర్తుందా శీతాకాలం’ అని మరో సినిమా చేస్తోంది. అందులో సత్యదేవ్ హీరో. ఇప్పటివరకు తమన్నా పనిచేసిన హీరోలతో కంపేర్ చేస్తే సత్యదేవ్ చాలా జూనియర్. నటుడిగా అతడు మంచి పేరు తెచ్చుకున్నాడు. కాని ఇంకా స్టార్ స్టేటస్ అందుకోలేదు. కథ నచ్చడంతో ఆ సినిమా చేస్తుందని అనుకోవచ్చు. లేటెస్ట్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
అందులో అదిత్ అరుణ్ హీరో. హీరోగా సక్సెస్ అందుకోవడానికి చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడు. అతని పక్కన యాక్ట్ చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. డబ్బుల కోసమే ఇలా చేస్తోందా? అని చెవులు కొరుక్కుంటున్నారు. హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి తమన్నా ఎంట్రీ ఇచ్చి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైనే అయ్యింది. కెరీర్ ఇంకా కొనసాగించాలంటే వచ్చిన ఛాన్స్ లను వచ్చినట్లు యాక్సెప్ట్ చెయ్యాలనుకుంటుంది ఏమో అనుకుంటున్నారు. డబ్బులు ఎక్కువ వస్తాయనే తమన్నా ఐటమ్ సాంగ్స్ చేసిందంటారు. కథ నచ్చడంతో పాటు చిన్న హీరోల పక్కన యాక్ట్ చేసినందుకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తానంటే తమన్నా ఎందుకు వద్దంటుంది మరి?
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!