Tamannaah Remuneration: ఫస్ట్ రెమ్యునరేషన్ తో ఆ పని చేసిన తమన్నా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. దాదాపుగా 17 సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా తమన్నా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అటు యంగ్ జనరేషన్ హీరోలతో ఇటు సీనియర్ హీరోలకు జోడీగా తమన్నా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ కు కూడా ఓకే చెబుతూ తమన్నా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఒక్కో సినిమాకు తమన్నా కోటిన్నర రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారు.

టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తమన్నా కెరీర్ కు ప్లస్ అవుతోంది. సినీ కెరీర్ లో తమన్నా గ్లామర్ రోల్స్ తో పాటు అభినయ ప్రధాన పాత్రల్లో సైతం నటించి తన నటనతో మెప్పించారు. బాలీవుడ్ సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్ లలో కూడా తమన్నా నటిస్తున్నారు. పదో తరగతి చదివే సమయంలోనే తమన్నా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

టాలీవుడ్ లో తమన్నా నటించిన తొలి సినిమా శ్రీ కాగా హ్యాపీడేస్ సినిమాతో తమన్నాకు పాపులారిటీ దక్కింది. తమన్నా తొలి రెమ్యునరేషన్ లక్ష రూపాయలు కాగా మూడు రోజుల పాటు తమన్నా యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఆ రెమ్యునరేషన్ తో కాఫీషాప్ లో ఎంజాయ్ చేశానని తమన్నా వెల్లడించారు. ఫ్యామిలీతో కలిసి కాఫీషాప్ కు వెళ్లి ఆ మొత్తాన్ని ఖర్చు చేశానని తమన్నా చెప్పుకొచ్చారు.

వచ్చే ఏడాది తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఎఫ్3, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఫిట్ నెస్ విషయంలో కూడా తమన్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం తమన్నా వయస్సు 32 సంవత్సరాలు కాగా మరో నాలుగేళ్లు తమన్నా హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ తమన్నాకు మంచి స్నేహితురాలు. మరోవైపు మిల్కీ బ్యూటీ పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Share.