Tamanna, Allu Arjun: ‘పుష్ప 2’లో ఐటెమ్‌ సాంగ్‌ తమన్నాదేనట!

‘పుష్ప: ది రూల్‌’ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. వినిపించే ప్రశ్నలు షూటింగ్‌ ఎప్పుడు? ఐటెమ్‌ సాంగ్‌లో హీరోయిన్‌ ఎవరు?. ఎందుకంటే ‘పుష్ప: ది రైజ్‌’లో సమంత చేసిన ఐటెమ్‌ సాంగ్‌ అంత హిట్‌ అయ్యింది. ‘ఉ అంటారా.. ఊ ఊ అంటారా..’ అంటూ సమంత ఊపిన ఊపుడికి దేశం మొత్తం షేక్‌ అయ్యింది. ‘పుష్ప’రాజ్‌ పక్కన సమంతను చూసి కుర్రకారు అలా కిర్రెక్కిపోయారు మరి. దీంతో రెండోపార్టులో ‘పుష్ప’రాజ్‌తో ఆడిపాడేది ఎవరు అని ప్రశ్నలు వేస్తున్నారు.

‘పుష్ప 2’లో ఐటెమ్‌ సాంగ్‌ గురించి గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న చర్చలకు భిన్నంగా కొత్త పేరు, కొత్త విషయాలు బయటికొచ్చాయి. అదే ‘పుష్ప’లో ఐటెమ్‌ సాంగ్‌ ఉంది కానీ.. ఆ పాటలో డ్యాన్స్‌ వేసే భామది కేవలం పాటకే పరిమితమయ్యే క్యారెక్టర్‌ కాదట. అవును మీరు విన్నది నిజమే.. కథలో భాగమైన క్యారెక్టర్‌తోనే పుష్ప డ్యాన్స్‌ కడతాడట. సినిమాలో అడవిలో ఉండే ఓ అమ్మాయి పాత్ర ఉంటుందట. కథలో కీలక సమయంలో ఆ పాత్ర ఎంట్రీ ఇస్తుందట.

ఆ క్యారెక్టర్‌ను తమన్నాతో చేయించాలని చూస్తున్నారట సుకుమార్‌ – అల్లు అర్జున్‌. సినిమాలో రష్మిక గ్లామర్ ఉన్నప్పటికీ.. ఇంకాస్త గ్లామర్‌ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీని కోసం పుష్పరాజ్‌కి లవ్‌ ఇంట్రెస్ట్‌గా మరో హీరోయిన్‌ను తీసుకొస్తారని అన్నారు. ఇందులో ఏది నిజమవుతుందో తెలియదు కానీ.. తమన్నా అయితే ఈ సినిమాలో ఉంటుందని పక్కాగా చెబుతున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది అంటున్నారు.

అయితే, సమంత ఐటెమ్‌ సాంగ్‌ చేస్తే వచ్చిన హైప్‌, క్రేజ్‌, కిక్‌.. తమన్నా చేస్తే రాదు అనే విషయం గమనించాలి. ఎందుకంటే తమన్నా ఇప్పటికే చాలా ఐటెమ్‌ సాంగ్స్‌ చేసేసింది. కాబట్టి.. ‘పుష్ప: ది రూల్‌’లో కూడా అలాంటి అన్‌ ఎక్స్‌పెక్ట్‌డ్‌ హీరోయిన్‌ను తీసుకురావాలి. అయితే ఓ పాట వరకు అలాంటి హీరోయిన్‌ను తీసుకురావొచ్చు. కానీ చిన్న క్యారెక్టర్‌కి పెద్ద హీరోయిన్‌ను తీసుకురావడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇలా ఆలోచన మారిపోయింది అంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus