తమన్నాకి కాబోయే భర్త ఆ ముగ్గురు హీరోల్లా ఉండాలట..!

ఎంత మంది కుర్ర భామలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపుతున్నా… తమన్నా మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఇప్పటికే దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తన పాత్రలకి ప్రాధాన్యత ఉంటే.. సీనియర్ హీరోల సరసన కూడా నటించడానికి ఓకే చెప్పేస్తుంది. గత ఏడాది వెంకటేష్ తో ‘ఎఫ్2’ చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక మెగాస్టార్ సరసన ‘సైరా నరసింహారెడ్డి’లో నటించి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇక తమన్నా మంచి డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే.. దాంతో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ‘డ్యాంగ్ డ్యాంగ్’ సాంగ్ కి స్టెప్పులతో దుమ్ము రేపింది.

ఇలా తన ప్రత్యేకతని చాటుకుంటూనే వస్తుంది. ఇక తమన్నా తన కెరీర్ ను మొదలుపెట్టి 15 ఏళ్ళు దాటింది. కాని ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు. గతంలో ఈమె పెళ్ళికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. కాని ఈమె వాటిని ఖండించింది. ఇక ఇటీవల ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ‘తనకి గనుక స్వయంవరం ఏర్పాటు చేస్తే.. హృతిక్ రోషన్, విక్కీ కౌశల్, ప్రభాస్ లను’ పిలుస్తుందట. అంటే తమన్నా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఈ ముగ్గురిలా ఉండాలని క్లారిటీ ఇస్తుంది. దీంతో తమన్నాకి భర్త అయ్యే వ్యక్తి పొడుగ్గా ఉండాలన్న మాట’ అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus