సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు టాప్ ప్లేస్‌లో కొనసాగడం అరుదైన విషయం. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ఈ అరుదైన ఫీట్‌ను సాధించింది. 2005లో ‘శ్రీ’ (Sri) సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ గ్లామరస్ బ్యూటీ, ‘హ్యాపీడేస్’ (Happy Days) సినిమాతో బ్రేక్ అందుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. చిరంజీవి (Chiranjeevi) , వెంకటేష్ (Venkatesh) , ఎన్టీఆర్ (Jr NTR) , మహేష్ బాబు (Mahesh Babu), ప్రభాస్ (Prabhas)వంటి టాప్ స్టార్స్‌తో నటించే అవకాశం తెచ్చుకుంది. మొదటి రెండేళ్లు కష్టమైనా, ఆ తర్వాత తమన్నా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.
తెలుగులో క్రేజ్ తగ్గినా, మిల్కీ బ్యూటీ జోరు మాత్రం తగ్గలేదు. బాలీవుడ్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు చేస్తూ నార్త్ ఇండియా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి ‘వ్యన్’ అనే బిగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. దీనితో పాటు మరో నాలుగు హిందీ సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి. తమన్నా నటిస్తున్న ‘రైడ్ 2’ (RAID 2) సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల్లో ఆమె పాత్రలు చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతున్నాయని టాక్.
తమన్నా కెరీర్ విశ్లేషణలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే భాషలో ఉండకుండా, అన్ని ఇండస్ట్రీల్లో తన మార్క్‌ను చూపిస్తోంది. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే, ఎక్కడైనా అవకాశాలు ఉండేలా తన కెరీర్‌ను ప్లాన్ చేసింది. బాలీవుడ్‌లోనూ తమన్నాకు ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆమె రెగ్యులర్‌గా షేర్ చేసే స్టైలిష్ ఫోటోలు, గ్లామర్ పోస్టులు సోషల్ మీడియా వేదికగా పెద్ద క్రేజ్ తెచ్చిపెట్టాయి. రెండు దశాబ్దాల ప్రయాణంలో కూడా తమన్నా అదే ఎనర్జీతో ముందుకు వెళ్తోంది.
ఆమె బిజీ షెడ్యూల్, వరుస ఆఫర్లు చూస్తుంటే, మిల్కీ బ్యూటీ జోరు ఇంకా పదే పడదని స్పష్టంగా అర్థమవుతోంది. తన అందం, టాలెంట్ మిక్స్ చేసి ఈ స్థాయికి చేరుకున్న తమన్నా, ఇంకొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీపై తన ప్రత్యేక ముద్ర వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమన్నా విషయంలో చూసి చాలా మంది నటీమణులు నేర్చుకోవాల్సిన అంశం ఇదే. ఒక భాషలో అవకాశాలు తగ్గినా, మిగతా ఇండస్ట్రీల్లో బ్రాండ్‌ను నిలబెట్టుకోవడం. అందుకే అభిమానులు తమన్నాని లక్కీ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు.