జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా, పేరు ప్రతిష్టలు దక్కించుకున్నా.. అంతకంటే విలువైనది తల్లిదండ్రుల ప్రేమ అని అంతా అంటుంటారు. ఈ విషయం తెలిసాక అది నిజమే అని అంతా ఒప్పుకుంటారు. విషయం ఏంటి అంటే… తమిళ నటుడు బాబు .. అగ్ర దర్శకుడు భారతీ రాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు.అతను బాగా టాలెంటెడ్. అందుకే 1990లో వచ్చిన ‘ఎన్ ఉయిర్ తోజన్’ అనే మూవీలో హీరోగా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు.
ఆ తర్వాత ‘పెరుంపుల్లి’, ‘పొన్నుకు చేతి వందచు’ ‘తాయమ్మ’ వంటి చిత్రాల్లో కూడా నటించాడు. అయితే ‘మనసారా పరిహితంగా’ అనే సినిమా షూటింగ్ టైంలో ఓ ఫైట్ చిత్రీకరణలో భాగంగా అతను ఎత్తులో నుండి నేలపై దూకాల్సి వచ్చింది. డూప్ తో ఆ షాట్ చేయించాలని డైరెక్టర్ అనుకున్నాడు. కానీ అందుకు బాబు ఒప్పుకోలేదు. తనే చేస్తానని పట్టుబట్టాడు.దురదృష్టవశాత్తూ అదే టైంలో అతని వెన్నుముకకి తీవ్రమైన గాయం అయ్యింది.
దీంతో అతను మంచానికి పరిమితమవ్వాల్సి వచ్చింది. 30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన (Babu) బాబు సెప్టెంబర్ 19 న ప్రాణాలు విడిచాడు. ఈ క్రమంలో తల్లి కుడా క్రుంగిపోయి రెండు రోజుల క్రితం అంటే అక్టోబర్ 11 న చివరి శ్వాస విడిచింది. ఈ ఘటన ఒక్క తమిళ సినీ పరిశ్రమని కాకుండా యావత్ భారతదేశ ప్రజలని విషాదంలోకి నెట్టేసింది అని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ ఈ టాపిక్ చర్చనీయాంశం అయ్యింది.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు