ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. ఒక సినిమాపై ఆడియన్స్ ఒపీనియన్ రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి నచ్చింది.. ఇంకొకరికి నచ్చకపోవచ్చు. కానీ ఎక్కువ మందికి నచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది. అలాగే ఎక్కువ మందికి నచ్చని సినిమా ప్లాప్ అవుతుంది. ఈ విషయంపై అందరికీ ఓ క్లారిటీ ఉంది. కానీ ఈ మధ్య దర్శక నిర్మాతలు దీనిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మార్నింగ్ షోలు పడిన వెంటనే.. ఒరిజినల్ టాక్ బయటకు వచ్చేస్తుంది.
రివ్యూలు వంటివి రావడానికి మధ్యాహ్నం వరకు టైం పడుతుంది. మౌత్ టాక్ నెగిటివ్ గా ఉండి.. రివ్యూలు కొంచెం బెటర్ గా ఉన్నా.. సినిమాలు నిలబడతాయన్న గ్యారెంటీ లేదు. బహుశా అందుకే నిర్మాతలు తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల ‘కంగువా’ (Kanguva) సినిమా రిలీజ్ అయ్యింది. దానికి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడు శివని (Siva) తిట్టిపోశారు. సూర్య (Suriya) కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశాడంటూ విరుచుకుపడ్డారు. తర్వాత రివ్యూలు కొంచెం మిక్స్డ్ గా వచ్చాయి.
అయినా సరే ‘కంగువా’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఈ సినిమా ప్లాప్ అంటే నిర్మాత కానీ, హీరో సూర్య సతీమణి జ్యోతిక (Jyothika) కానీ ఒప్పుకోవడం లేదు. ఫైనల్ గా ‘కంగువా’ ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో (Tamil Producers) కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఓ కఠిన నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే.. సినిమా మొదటి రోజు యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిలిం క్రిటిక్స్ వంటి వారిని రానివ్వకుండా ఆపేయాలట. వారి వల్లే ‘వేట్టయన్’ (Vettaiyan) ‘ఇండియన్ 2’ (Indian 2) ‘కంగువా’ వంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయని వారు ఆరోపిస్తున్నారు.
‘వేట్టయన్’ కి యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి. వీకెండ్ వరకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తర్వాత డౌన్ అయ్యాయి. అయితే ఇండియన్ 2 , కంగువా వంటి సినిమాలు ఏమైనా బాగున్నాయా? ఇక్కడ (Tamil Producers) ప్రొడ్యూసర్ కౌన్సిల్ గమనించాల్సింది ఏంటంటే.. ‘సినిమా బాగుంటే, దానిపై కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఎవ్వరూ ఆపలేరు. పైగా యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిలిం క్రిటిక్స్ ని మొదటి రోజు సినిమాలకి రాకుండా ఆపడం అనేది కూడా ఒక బుర్ర తక్కువ ఆలోచనగానే భావించాలి.