ఇప్పుడిప్పుడే జనాలు కరోనా బారి నుంచి కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియెంట్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దీంతో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో కేసులు బయటపడుతుండడంతో.. ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకుంటున్నాయి. అయినప్పటికీ.. రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాయి కొందరు. అలాంటి వ్యక్తుల్లో ప్రముఖులు కూడా ఉండడంతో ప్రభుత్వం సీరియస్ అయింది.
ఇటీవల కరోనా బారిన పడ్డ కమల్ హాసన్ బిగ్ బాస్ తమిళ షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో కమల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వెంటనే బిగ్ బాస్ షో షూటింగ్ లో పాల్గొనడం ఏంటని నిలదీసింది. రూల్స్ ను అతిక్రమించి షూటింగ్ చేయడం కరెక్ట్ కాదని.. దీనివలన మిగతా వారికి ప్రమాదం ఏర్పడుతుందని తెలిపింది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులే ఇలా బాధత్య లేకుండా ప్రవర్తిస్తారా..?
అంటూ ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమల్ హాసన్ కి నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై కమల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!