Tanikella Bharani: క్షమాపణలు చెప్పిన ప్రముఖ నటుడు!
- April 16, 2021 / 06:12 PM ISTByFilmy Focus
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగానే కాకుండా.. రచయితగా, కవిగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు తనికెళ్ల భరణి. తన సాహిత్యంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. వివాదాలకు దూరంగా ఉండే తనికెళ్ల భరణి ఇప్పుడు అనుకోకుండా ఓ గొడవలో ఇరుక్కున్నారు. ‘శబ్బాష్ రా’ అనే పేరుతో ఆయన కవితలు రాస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పేరుతో ఓ పుస్తకం ప్రచురించిన ఆయన.. దానికి కొనసాగింపుగా ఫేస్ బుక్ లో తరచూ కొత్త కవితలు రాస్తుంటారు.
ప్రస్తుతం పరిస్థితులకు ముడిపెడుతూ.. శివుడిని కీర్తించేలా ఆ కవితలు ఉంటాయి. అయితే తాజాగా ఆయన పోస్ట్ చేసిన కవిత హేతువాదులు ఆగ్రహం తెప్పించింది. ఇంతకీ ఆ కవిత ఏంటంటే.. ”గప్పాల్ గొడ్తరు గాడ్దె కొడుకులు నువ్వుండగ లేవంటరు! నువ్వున్నవో లేవో చెవుల జెప్పిపోరా శబ్బాష్ రా శంకరా” ఈ కవితలో దేవుడు లేడన్న వారిని గాడిద కొడుకులుగా అభివర్ణించడంతో హేతువాదులు, నాస్తికులు మండిపడుతున్నారు. ప్రముఖ హేతువాది బాబు గోగినేని సైతం తనికెళ్ల భరణిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘గాడిద కొడుకులు’ అని ఎవరైనా ఒళ్లు బలిస్తేనే రాస్తారు అంటూ భరణిపై మండిపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన తనికెళ్ల భరణి ఓ వీడియో రిలీజ్ చేశారు. దురదృష్టవశాత్తూ తన కవిత కొందరిని బాధ పెట్టిందని.. ఆ కవితకు వివరణ ఇవ్వదలచుకోలేదని.. అలా చేస్తే కవరింగ్ లా ఉంటుందని.. కాబట్టి తాను నొప్పించిన వారందరికీ బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటూ చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. తనకు హేతువాదులన్నా.. మానవతావాదులన్నా.. గౌరవం తప్ప వ్యతిరేకత లేదని అన్నారు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!















