Tanusree Datta: ఆ సినిమాలో ముద్దు సీన్స్‌తో చాలా ఇబ్బందిపడ్డా: బాలయ్య హీరోయిన్‌

ఇప్పుడు అంటే ఇంటిమేట్‌ సీన్లు, హాట్‌ సాంగ్‌లు మన సినిమాల్లో కాస్త కామన్‌ అయిపోయాయి కానీ… ఒకప్పుడు అలాంటి సన్నివేశాలు చేయడానికి హీరోయిన్లు వెనుకంజ వేసేవారు. పాటల సంగతి అయితే సరేసరి. అలాంటి సమయంలో ‘ఆషిక్‌ బనాయా ఆప్నే…’ అంటూ తనుశ్రీ దత్తా కుర్రకారును హీటెక్కించింది. ఇమ్రాన్‌ హష్మీతో కలసి ఆమె చేసిన ఆ పాట ఇప్పటికే కుర్రకారు హాట్‌ ఫేవరేటే. అయితే ఆ సినిమాలో నటీనటుల ముద్దు సన్నివేశాలపై అప్పట్లో బాలీవుడ్‌లో చర్చే జరిగింది.

మరీ హద్దు దాటి ఆ సినిమా, ఆ పాట చేశారు అంటూ సంప్రదాయవాదులు పేరిట కొంతమంది ఫైర్‌ అయ్యారు. తాజాగా ఆ సినిమా గురించి, అప్పటి విషయాల గురించి తనుశ్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు తాను ఎంతో ఇబ్బందిపడ్డాను అనే విషయాన్ని వివరంగా చెప్పుకొచ్చారు. ఇమ్రాన్‌ హష్మీతో మూడు చిత్రాల్లో నటించా. ‘ఆషిక్‌ బనాయా ఆప్నే’ మా కాంబోలో వచ్చిన మొదటి సినిమా. అందులో మాపై రొమాంటిక్‌ సీన్స్ ఉన్నాయి.

అందులో ఓ ముద్దు సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఇబ్బందిపడ్డాను. ఇమ్రాన్‌త నాకు పరిచయం లేదు. ఆయనతో కిస్‌ సీన్‌ అనగానే కాస్త కంగారు పడ్డాను. కాకపోతే టీమ్‌ సపోర్ట్‌ చేయడంతో ఆ సీన్స్‌ చేయగలిగాను అని చెప్పింది తనుశ్రీ దత్తా. ఆ సినిమా తర్వాత చేసిన ‘చాక్లెట్‌’ సినిమాలోనూ మాపై కిస్‌ సీన్స్‌ పెట్టారు. అయితే ఎందుకో గానీ ఆ సీన్స్‌ ఎడిటింగ్‌లో తీసేశారు అని చెప్పింది. నిజానికి ఆ రోజుల్లో ఇమ్రాన్‌ హష్మీకి బాలీవుడ్‌లో కిస్సర్‌ బాయ్‌ అనే ఇమేజ్‌ ఉండేది.

ఎందుకు ఆ ఇమేజ్‌ వచ్చిందో కానీ… నాకు తెలిసినంత వరకూ ఇమ్రాన్‌ అలాంటివాడు కాదు. ముద్దు సన్నివేశాల్లో యాక్ట్‌ చేయడానికి అతను కూడా పడేవాడు అని చెప్పింది తనుశ్రీ. నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీరభద్ర’ తనుశ్రీ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌కి మాత్రమే పరిమితమైన తనుశ్రీ (Tanusree Datta) తెలుగులో సినిమాలు చేయలేదు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus