నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మరణించారు. నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కోమాలోకి వెళ్ళిపోయి.. 23 రోజుల పాటు మరణించడం జరిగింది. తారకరత్న మరణించాడు అంటే అందరికీ ఓ కలలానే ఉంది.ఇప్పటికీ అతను కళ్ళ ముందు తిరుగుతున్న ఫీలింగ్ జనాలకు కలుగుతుంది. ఎందుకంటే ‘వీరసింహారెడ్డి’ సినిమా టైంలో కానీ.. తర్వాత అతను టీడీపీ పార్టీలో చేరినప్పటి నుండి మీడియాలో కాస్త ఎక్కువగా కనిపించారు. నిండా 40 ఏళ్ళు కూడా లేని తారకరత్న మరణించాడు అని తెలిస్తే అందరూ దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.
ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులు ఇంకా ఆ విషాదం నుండి కోలుకోలేదు. ఇదిలా ఉండగా.. రేపు తారకరత్న పెద్ద కర్మ. ఈ క్రమంలో నందమూరి అభిమానులకు కూడా ఆహ్వానం అందింది. అలాగే సినీ రాజకీయ రంగాల్లో నుండి ఊహించని వ్యక్తులు హాజరుకాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. రాజకీయాల పరంగా చూసుకుంటే తారకరత్నకు బంధువు అయిన విజయసాయిరెడ్డి హాజరవుతారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా హాజరవుతారు. ఇక కళ్యాణ్ రామ్ తో పాటు జూ.ఎన్టీఆర్ కూడా బాలయ్య పక్కన కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ఇక సినీ పరిశ్రమ నుండి అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య .. మొన్నామధ్య అక్కినేని ఫ్యామిలీ పై ఊహించని విధంగా కొన్ని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అంటే ఓ రకంగా ఆసక్తి కలిగించే అంశమే అని చెప్పాలి.