NBK108: బాలయ్య, తారక రత్నను ఏ క్యారెక్టర్ కోసం తీసుకోవాలనుకున్నారో తెలుసా!..

నటసింహ నందమూరి బాలకృష్ణ కుటుంబానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో ఇటీవల కాలంలో అందరికీ తెలిసింది. తన అన్నయ్య నందమూరి మోహన కృష్ణ తనయుడు నందమూరి తారక రత్న అనారోగ్యంతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కుప్పం పాదయాత్రలో గుండె పోటుకి గురైనప్పటి నుండి ఆ రోజు అర్థరాత్రి అంబులెన్సులో బెంగుళూరు తరలించడం, అక్కడ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవడం.. తారక రత్న భార్య, కుమార్తెకు ధైర్యం చెప్పడం..

బావ చంద్రబాబు నాయుడితో పాటు మోహన కృష్ణ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలివిడిగా ఉంటూ.. అన్న కొడుకు కోలుకోవాలంటూ అఖండ జ్యోతి వెలిగించడం, చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పడం, ప్రత్యేక పూజలు జరిపించడం చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు బాలయ్య. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ భార్యలతో సహా వచ్చి తారక రత్నను పరామర్శించారు.తారక్ భార్య అలేఖ్య రెడ్డి బంధువైన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా హాస్పిటల్‌కి వచ్చారు.

ప్రస్తుతం తారక రత్న చికిత్సకు స్పందిస్తున్నారని తెలిసింది. ఇంతలో మరింత మెరుగైన వైద్యం కోసం తనను విదేశాలకు తీసుకెళ్లబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తన 108వ సినిమాలో బాలయ్య, తారక రత్నను ఓ కీలక పాత్రలో నటింపజెయ్యాలనుకున్నారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. శ్రీలీల, బాలయ్య కూతురి క్యారెక్టర్ చేస్తుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా ఫిక్స్ అయిందని, అందుకుగానూ ఆమెకు రూ. 3 కోట్ల భారీ పారితోషికాన్ని ఇస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర కోసం తారక రత్న అయితే బాగుంటుంది అంటూ దర్శకుడికి బాలయ్య చెప్పడం.. దానికోసం ప్రయత్నాలు జరుపడం కూడా జరిగిందని, ఇంతలో తారక్ అనారోగ్యానికి గురవడం బాధాకరమంటూ నందమూరి అభిమానులు సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus