Tarakaratna: అవకాశమొస్తే మహేష్‌ సినిమాలో చేస్తా: తారకరత్న

నందమూరి తారకరామారావు మనవడు హీరోగా వస్తున్నాడు అంటే ఆ హైప్‌ ఓ లెవల్‌లో ఉంటుంది. అయితే అలా వచ్చిన వారిలో ఒకరే ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. మరొకరు కెరీర్‌లో ఇంకా స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నారు. అతనే తారకరత్న. తొమ్మిది సినిమాలను ఒకే రోజు ప్రారంభించి వావ్‌ అనిపించారాయన. ఆ తర్వాత సరైన విజయం దొరక్క, సైడైపోయినట్లు కనిపించారు. ఈ సమయంలో కీలక పాత్రలకు మొగ్గుచూపారు. విలన్‌గా కూడా మారారు. ఇటీవల మహేష్‌ సినిమాలో విలన్‌ అవుతున్నారు అంటూ వార్తలొచ్చాయి.

వాటిపై ఆయన స్పందించారు. మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ సినిమాలో మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నానని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి మీరు ఏమంటారు అని తారక్‌రత్నను అడిగితే… ‘‘నా పేరుతో ఉన్న ఓ ఫేక్‌ ట్విటర్‌ అకౌంట్‌ నుండి ఆ ట్వీట్‌ రావడంతో అందరూ ఆ వార్త నిజం అనుకున్నారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటివరకూ ఆ చిత్రబృందం నుండి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమాలో నటిస్తాను’’ అని తారకరత్న చెప్పాడు.

అయినా నాకు సోషల్‌ మీడియా అంటే ఇష్టం ఉండదు. ఎవరితోనైనా డైరెక్ట్‌గానే మాట్లాడటానికే ఇష్టపడుతుంటాను. అందుకే ఏ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోనూ నాకు ఖాతాల్లోవు అని తారక్‌రత్న క్లారిటీ ఇచ్చారు. గతంలో ఆయన సినిమాల విషయంలో వచ్చిన పుకార్లకు తారక్‌రత్న టీమ్‌ ఇలాంటి సమాధానమే ఇచ్చింది. కానీ పుకార్లు ఆగడం లేదు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇండస్ట్రీలోకి వచ్చిన టైమ్‌లోనే మీరూ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తారక్‌కి పోటీగానే మీరు సినిమాల్లోకి వచ్చారని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు..

ఇందులో నిజానిజాలు ఎంత అని అడగ్గా… ‘‘తమ్ముడు ఎన్టీఆర్‌ 2001లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆయన తర్వాతే నేను వచ్చాను. ఆ సమయంలో అందరూ ఎన్టీఆర్‌కు పోటీగానే తారకరత్నను సినిమాల్లోకి వచ్చాడు అనుకున్నారు. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తారకరత్న.‘‘తారక్‌తో నేను ఎప్పుడూ పోటీ అనుకోలేదు. అప్పుడే నేను దీన్ని క్లియర్‌ చేయాలనుకున్నా, కానీ వీలుపడలేదు.

నేను పరిశ్రమలోకి వచ్చేసరికే తారక్‌ ‘ఆది’తో హిట్‌ అందేసుకున్నాడు. ఈ రోజుకీ మా ఫ్యామిలీ పేరు అభిమానుల్లో అలా నిలబడి ఉందంటే దానికి తారక్‌ కూడా ఒక కారణం అని అన్నారు తారక్‌రత్న. తాము తరచూ కలుస్తుంటాం, సరదాగా టైమ్‌ గడుపుతుంటాం అని కూడా చెప్పారు తారకరత్న.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus