Tarun: తరుణ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన రోజా రమణి!

మనసు మమత సినిమా ద్వారా బాల నటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరుణ్ అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నువ్వే కావాలి, ప్రియమైన నీకు వంటి ప్రేమ కథ చిత్రాలలో నటించే లవర్ బాయ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి తరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి తరుణ్ గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారని పలు వార్తలు వచ్చాయి అలాగే ఈయన పెళ్లి గురించి కూడా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా తరుణ్ తల్లి రోజా రమణి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కొడుకు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా రోజా రమణి మాట్లాడుతూ తరుణ్ వ్యక్తిగత జీవితం గురించి వృత్తిపరమైన జీవితం గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయని తెలిపారు.

ఇలా తరుణ్ (Tarun) గురించి వచ్చే వార్తలు చూస్తే తనకు చాలా బాధేస్తుందని తెలిపారు. అయితే తను తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతున్నారని ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లోను అలాగే సినిమాలోని నటిస్తున్నారని తెలిపారు. అయితే ఇందులో ఏది మొదట విడుదలవుతుందో తనకు తెలియదు కానీ తప్పకుండా తరుణ్ తిరిగి ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవుతారని రోజా రమణి ధీమా వ్యక్తం చేశారు.విషయాల గురించి మాట్లాడుతూ తరుణ్ కు చాలా భక్తి ఎక్కువ ప్రతిరోజు ఒక గంటన్నర పాటు పూజ చేస్తారనీ తెలిపారు

ఏడాదికి ఒకసారి తిరుపతి వెళ్తారు శని మంగళవారంలో నాన్ వెజ్ అసలు ముట్టుకోరని రోజా రమణి తెలిపారు.ఇక మిగతా రోజులలో తరుణ్ ఎక్కువగా చికెన్ తింటారని ఈ సందర్భంగా రోజా రమణి తెలియజేశారు. ఇక తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు పెళ్లి జరిగితే అంతకన్నా తనుకు సంతోషకరమైన విషయం ఏదీ లేదని అది కూడా త్వరలోనే జరగబోతుంది అంటూ ఈ సందర్భంగా రోజా రమణి ఇండస్ట్రీ రీ ఎంట్రీ గురించి, తన పెళ్లి గురించి చెబుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus