బాలనటుడిగా తన సినిమాలతో ప్రేక్షకులను ఊహించని స్థాయిలో మెప్పించిన తేజ సజ్జా హీరోగా కూడా ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. హనుమాన్ మూవీ విషయంలో సైతం తేజ సజ్జా పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుండగా బాలీవుడ్, ఓవర్సీస్ లో సైతం హనుమాన్ మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది.
అయితే రాజకుమరుడు మూవీ షూట్ టైమ్ లో తనకు ఎదురైన అనుభవం గురించి తేజ సజ్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ కుమారుడు షూటింగ్ సమయంలో నోరు తిరగకపోవడం వల్ల మహేష్ బాబును మగేశ్ అన్నా మగేశ్ అన్నా అని పిలిచేవాడినని ఆ సమయంలో మహేష్ బాబు నా పేరును కూని చేయవద్దని అన్నా అని పిలవాలని సూచనలు చేశారని తేజ సజ్జా కామెంట్లు చేశారు.
ఆ సంఘటన జరిగి దాదాపుగా 25 సంవత్సరాలు అయినా ఇప్పటికీ గుర్తుందని తేజ సజ్జా పేర్కొన్నారు. చిన్న పిల్లలతో యాక్టింగ్ చేయించడం సులువు కాదని బాల నటుడిగా నాకు అనుభవం ఉండటం వల్లే ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నానని తేజ సజ్జా చెప్పుకొచ్చారు. మరోవైపు గుంటూరు కారం రిలీజ్ రోజునే హనుమాన్ ను రిలీజ్ చేయడం వెనుక అసలు కారణాలను సైతం తేజ సజ్జా వెల్లడించారు.
మొదట గుంటూరు కారం సినిమాను జనవరి 13వ తేదీన ప్రకటించడంతో మా సినిమాను జనవరి 12వ తేదీన ప్రకటించడం జరిగిందని తేజ సజ్జా పేర్కొన్నారు. ఆ తర్వాత గుంటూరు కారం సినిమాను జనవరి 12వ తేదీన ప్రకటించారని అప్పటికే హనుమాన్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్లను పూర్తి చేయడంతో మేము ఏం చేయలేకపోయామని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!