Teja Sajja: వామ్మో.. తేజ సజ్జా కొత్త మూవీ బడ్జెట్ ఎంతో మీకు తెలుసా?

తేజ సజ్జా (Teja Sajja) ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ (Hanu Man) మూవీ 330 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి ఓటీటీలో సైతం అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బుల్లితెరపై ఎప్పుడు ప్రసారమవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తేజ సజ్జా మార్కెట్ పెరగడంతో సినిమాల బడ్జెట్లు పెరుగుతున్నాయి. తేజ సజ్జా కొత్త మూవీ బడ్జెట్ 40 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) ఈ సినిమాకు దర్శకుడు కాగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 40 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. మిరాయ్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో హనుమాన్ తో అదరగొట్టిన తేజ సజ్జా తర్వాత ప్రాజెక్ట్ లతో ఏ రేంజ్ ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. తేజ సజ్జా రేంజ్ సైతం అంతకంతకూ పెరుగుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తేజ సజ్జా కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. మిరాయ్ సినిమాలో రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. తెలుగులో రితికా నాయక్ కు సైతం మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. తేజ సజ్జా, రితిక జోడీ బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తేజ సజ్జా రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే తేజ సజ్జా రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తేజ సజ్జా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. తేజ సజ్జాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కథనం విషయంలో సైతం తేజ సజ్జా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus