తేజ హీరో అవుతానంటే.. ఈ మాట అన్నది ఎవరు?

తేజ.. బాలనటుడిగా చాలా సినిమాల్లో చేశాడు. అయితే గుర్తుండిపోయే సినిమాల్లోఒ ఆఖరిగా చేసిన ‘ఇంద్ర’ గురించే చెప్పుకోవాలి. స్కూలు బ్యాగు విసిరి.. ‘నేనున్నా’ అంటూ తొడ కొట్టి, కత్తి పట్టిన సీన్‌ ఇంకా ఎవరూ మరచిపోలేరు. ఆ కుర్రాడు ఆ తర్వాత ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి తేజ జీవితంలో అంత కీలకమైన సినిమా ‘ఇంద్ర’ హీరో మెగాస్టార్‌ చిరంజీవి ఏమన్నారు. తేజ హీరో అవుతా అంటే ఆయనేం చెప్పాడనేది ఇటీవల తేజ చెప్పుకొచ్చాడు. ఆ విషయాలు మీ కోసం.

‘‘నేను హీరో అవుతా’ అంటూ నాలుగైదేళ్ల నుంచి చిరంజీవిగారితో అని చెబుతూనే ఉన్నాను. అయితే ఆయన ‘ముందు నువ్వు డిగ్రీ పూర్తి చెయ్‌’ అనేవారు. అలా ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా చేస్తున్నట్లు ఆయనకు చెప్పాను. ఆ సందర్భంగా నన్ను విష్‌ చేశారు అంటూ చిరంజీవి స్పందననను చెప్పుకొచ్చాడు తేజ. అంతేకాదు ఈ సినిమా చూసిన తర్వాత.. ‘మన పిల్లోడు మంచి సినిమా చేశాడు’ అని అందరూ అంటారని తేజ చెబుతున్నాడు.

చాలామంది హీరోలు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాల్లోకి వస్తుంటారు. కానీ ఓ బాలనటుడిగా తేజ చిరంజీవితో పని చేసి వచ్చాడు. మరి అతని దగ్గర ఏం నేర్చుకున్నావ్‌ అని అడిగితే… సరిగ్గా చెప్పకుండా మాట దాటేశాడు. ‘‘ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విషయం నేర్చుకుంటాం. ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నాం అనే విషయం వివరించి చెప్పలేం. అది మనలో అంతర్గతంగా ఉంటుంది. వాళ్లను చూస్తుంటే మనకు తెలియకుండానే ఏదో ఒక విషయం నేర్చుకుంటాం’’ అంటూ జనరల్‌ చేసి మాట్లాడేశాడు తేజ.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus