సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని ఎంతో మంది … గొంతు విప్పి గోల చేసారు. ‘మీటూ’ అంటూ దేశం మొత్తం రచ్చ చేసారు. అయితే బాలీవుడ్ లో ఈ ఉద్యమం కొంత వరకూ పనిచేసింది కానీ… సౌత్ లో మాత్రం పనిచెయ్యలేదు. ఇక్కడ ‘క్యాస్టింగ్ కౌచ్ లాంటిది ఏమీ లేదని’ కొందరు… ‘క్యాస్టింగ్ కౌచ్’ ఉంది కానీ మాకు ఎదురవ్వలేదని’ మరికొందరు ఓ మాట చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీ రెడ్డి, చిన్మయి వంటి వారు ఎంత గొంతుచించుకున్నా ఫలితం లేకపోయింది.
అయితే బాలీవుడ్ లో కొంతమేర ‘మీటూ’ పనిచేసిందనే చెప్పాలి. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొన్న వారిని పలు పెద్ద సినిమాల నుండీ తొలగించారు. సౌత్ లో అలాంటి కఠిన చర్యలు ఎవ్వరూ తీసుకోలేదు. చాలా మంది మర్చిపోయారు కూడా..! అయితే ఇలాంటి టైములో నటి తేజస్వి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ‘ఆహా’ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థకు ‘కమిట్మెంట్’ అనే వెబ్ సిరీస్ చేసిన తేజస్వి తాజాగా మీడియాతో మాట్లాడింది. ‘ఇక్కడ పడుకుంటేనే అవకాశాలు ఇస్తారు. 90 శాతం అదే జరుగుతుంది.
ముంబై హీరోయిన్లు అయితే పడుకోవడానికి రెడీ అయ్యే వస్తారు. అందుకే వారికే ఎక్కువ ఆ ఛాన్స్ లు వస్తాయి. నేను కమిట్మెంట్ ఇవ్వలేదు కాబట్టే నాకు అవకాశాలు రావడం లేదు. అంతేకాని ‘నేను తెలుగమ్మాయిని, అందంగా లేను అనే కారణాలతో కాదు’ అంటూ చెప్పుకొచ్చింది తేజస్వి. అయితే ఈమె కామెంట్స్ ను పెద్దగా ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ‘ఇలా అయినా మళ్ళీ పబ్లిక్ అటెన్షన్ డ్రా చేసి మళ్ళీ పాపులర్ అవ్వాలి అని చూస్తుంది. అలా అవకాశాలు సంపాదించుకోవాలి అని ప్లాన్ చేస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.