సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమలో గోదావరి జిల్లాలకు చెందిన ఓ యంగ్ స్టూడెంట్ పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ తేజస్వి మాదివాడ. ”నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువే నండి.. కాలేజ్ లో ఓ బ్యాచ్ ని కూడా మైంటైన్ చేస్తున్నాను” అని మహేష్ తో ఆమె చెప్పిన ఓ డైలాగ్ బాగా ఫేమస్. ఆ తరువాత రెండు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన తేజస్విని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీం అనే రొమాంటిక్ క్రైమ్ హారర్ డ్రామాలో హీరోయిన్ గా బోల్డ్ రోల్ చేసింది.
ఆ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చినా డబ్బులు బాగానే వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ టూ లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. తెలుగులో అడపాదడపా రోల్స్ చేస్తున్న తేజస్విని క్యాస్టింగ్ కౌచ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్నారు. సినిమా పట్ల ఫ్యాషన్ లేకుండా సరదాగా ఇండస్ట్రీలోకి వచ్చినవారు హీరోయిన్స్ ని కమిట్మెంట్స్ అడుగుతారు. నన్ను కూడా కమిట్మెంట్ చాలామంది అడిగారు. అయితే నేను వాటికి ఒప్పుకోలేదు అన్నారు. ఇక ముంబై హీరోయిన్స్ కమిట్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు.
అందుకే ఇక్కడ వారికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అలాగే తెలుగు అమ్మాయిలు చిత్ర పరిశ్రమకు వచ్చే ముందే అనేక నియమాలు, హద్దులు పెట్టుకొని వస్తారు. బికినీ వేయడకూడదు, ముద్దులకు దూరంగా ఉండాలి, ఎక్స్ పోజింగ్ వంటి వాటికి దూరంగా ఉంటారు. అది కూడా ఓ కారణం అని ఆమె చెప్పారు. పరిశ్రమలో 90 శాతం క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న తేజస్విని వాళ్ళను దాటుకొని వచ్చినప్పుడు నిజమైన వ్యక్తులు మనకు దొరుకుతారు అన్నారు.