తెలంగాణ సీఎం ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసిఆర్, చంద్రబాబులతో పాటు పలువురు ముఖ్య నేతలకు ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అంటే రేవంత్ రెడ్డికి ఎంతో అభిమానమట.

గతంలో పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించారట. రేవంత్ రెడ్డి ఫేవరెట్ హీరో ఎవరో తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. తెలంగాణ రెండో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ అమలుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన పథకాల అమలు కోసం 88,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని సమాచారం అందుతోంది.

మరోవైపు తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరు కానున్నారని తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని నలుమూలల నుంచి వీఐపీలు సైతం హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.

బండ్ల గణేష్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, (Revanth Reddy) రేవంత్ రెడ్డి సీఎం కావడం సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. తనకేం పదవి అక్కర్లేదని బండ్ల గణేష్ అన్నారు. బండ్ల గణేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేర్వేరు పోస్ట్ లను షేర్ చేస్తుండగా ఆ పోస్ట్ లు తెగ వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus