Acharya: తెలంగాణలో పెరిగిన ఆచార్య రేట్లు.. కానీ?

మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఆచార్య సినిమా విడుదల కానుంది. కేజీఎఫ్2 సినిమా హవా తగ్గిన నేపథ్యంలో ఆచార్యకు థియేటర్లలో పోటీనిచ్చే సినిమా అయితే లేదు. నైజాంలో ఆచార్యకు థియేటర్ల విషయంలో సమస్యలు వస్తున్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా రిలీజ్ సమయానికి ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ సర్కార్ ఈ సినిమాకు తీపికబురు అందించింది. తెలంగాణలో ఆచార్య సినిమా ఐదో ఆటకు, టికెట్ రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం గమనార్హం.

Click Here To Watch NOW

ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే నెల 5వ తేదీ వరకు అదనపు షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం నుంచి థియేటర్ల యాజమాన్యాలకు అవకాశం దక్కింది. మల్టీప్లెక్స్ లలో 50 రూపాయలు, ఏసీ థియేటర్లలో 30 రూపాయల మేరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు లభించాయి. ధర్మస్థలి గ్రామం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఏపీలో కూడా ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు లభించే ఛాన్స్ అయితే ఉంది.

సోనూసూద్, పూజా హెగ్డే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. చిరంజీవి, చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని సమాచారం అందుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడం గమనార్హం. ఆచార్య మెగా ఫ్యాన్స్ అంచనాలకు తగిన విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా మహతి స్వరసాగర్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారని సమాచారం. చిరంజీవి, చరణ్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus