Allu Arjun: యాడ్ లో నటించి అడ్డంగా బుక్కైన బన్నీ!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి తెలంగాణ స్టేట్ ఆర్టీసీ లీగల్ నోటీసులు పంపించింది. ఇటీవల అల్లు అర్జున్ ర్యాపిడో యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్ఠను కించపరిచేలా ర్యాపిడో ప్రకటన ఉందంటూ అల్లు అర్జున్‌ తో పాటు ర్యాపిడో సంస్థకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ నోటీసులు పంపారు. దీనిపై ఓ ప్రకటనను విడుదల చేశారు.

యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ యాడ్ లో డైలాగ్ వేశాడు. ఈ యాడ్ పై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారు ఖండిస్తున్నారు.

టీఎస్‌ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉందని.. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలని.. అందుకే అల్లు అర్జున్ తో పాటు ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసులు ఇస్తున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. అలానే బస్‌ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్‌, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus