సినిమాల్లో మాస్ పాటలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యూజిక్, లిరిక్స్ తో పాటుగా, హీరో-హీరోయిన్ల డ్యాన్స్ మూమెంట్స్ కూడా వీటిని ట్రెండింగ్ లో ఉంచుతాయి. అయితే, ఇటీవల కాలంలో హుక్ స్టెప్పుల పేరిట కొన్ని పాటల్లో ఘాటైన మూమెంట్స్ పెరిగిపోవడం వివాదాలకు దారి తీస్తోంది. ఫ్యాన్స్, యూత్ ను ఆకర్షించేలా డిజైన్ చేసినప్పటికీ, వీటిపై విపరీతమైన ట్రోలింగ్ వస్తోంది. తాజాగా ఇదే సమస్య ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాలోని ‘అదిదా సర్ ప్రైజు’ పాటకు ఎదురైంది.
ఈ సినిమాలో హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఆమె చేసిన హిట్టేక్కించే స్టెప్పులు, మల్లెపూలతో డిజైన్ చేసిన కొరియోగ్రఫీ సోషల్ మీడియాలో హీటెక్కించాయి. ఈ హుక్ స్టెప్పులు మరీ హద్దులు దాటుతున్నాయన్న అభిప్రాయంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, మహిళా కమిషన్ దృష్టికి ఈ విషయం వెళ్లింది. పాటలోని కొన్ని మూమెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన కమిషన్, స్టెప్పులను తొలగించాలని సూచించింది. దీంతో, ‘అదిదా సర్ ప్రైజు’ పాటలో హాట్ హుక్ స్టెప్పులను ఎడిట్ చేసి, కొత్త వెర్షన్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్టు టాక్.
ఇంతకు ముందు కూడా బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా ‘దబిడి దిబిడే’ పాటలోని కొన్ని స్టెప్పులపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) పై బాలయ్య చేసిన డాన్స్ మూమెంట్స్ పట్ల ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన రావడంతో, సినిమా (Robinhood) రిలీజ్ కు ముందు మేకర్స్ కొన్ని భాగాలను తొలగించారు. ప్రత్యేకించి బాలయ్య ఊర్వశి బ్యాక్ పై చేసిన స్టెప్‌పై నెగటివిటీ పెరిగిపోవడంతో, దాన్ని మార్చి మరీ థియేటర్లలో రిలీజ్ చేశారు. సినిమాల్లో మాస్ ఆడియన్స్ ను ఆకర్షించేందుకు పాటల హుక్ స్టెప్పులను మేకర్స్ ఇన్సర్ట్ చేస్తున్నారు.
అయితే, ఈ ట్రెండ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. గతంలో పాటలు మాస్ స్టైల్ లో ఉన్నా, క్లాస్ టచ్ ఉండేది. కానీ ఇప్పుడు మరీ బోల్డ్ మూమెంట్స్ పెరగడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కొరియోగ్రాఫర్లు, దర్శకులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలా హాట్ హుక్ స్టెప్పుల పేరుతో, పబ్లిసిటీ కోసం వివాదాలకు తావిస్తూ పాటలను డిజైన్ చేస్తే, భవిష్యత్తులో మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశముందని అంటున్నారు సినీ విశ్లేషకులు.