నాగవంశీ హైప్స్ తారక్ – త్రివిక్రమ్ అంటూ మొదలై.. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాగా మారి.. మళ్లీ తారక్ – త్రివిక్రమ్ సినిమా మారింది ఓ భారీ ప్రాజెక్ట్. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కనుంది. దీని గురించి ఇప్పటికే నిర్మాత నాగవంశీ చాలా హైప్స్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి సినిమా హైప్‌ను పెంచే ప్రయత్నం చేశారు. తమ సినిమా స్థాయి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా చెప్పారు నాగవంశీ.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రం రూపొందనుందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. కార్తికేయుని జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఆ మధ్య తారక్ చేతిలో కూడా దానికి సంబంధించిన పుస్తకం మనం చూశాం. సినిమా మీద మరింత హైప్‌ను పెంచడానికి తారక్ ఆ బుక్‌తో బయట మీడియాకు కనిపించాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు నాగవంశీ మాటలు చూస్తుంటే అంతకుమించిన ప్లానింగ్ ఉందనిపిస్తోంది.
త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. త్రివిక్రమ్ మొదటిసారి మైథలాజికల్ సినిమా తెరకెక్కించనున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్‌ను నేను అలాంటి పాత్రలో చూపిచంబోతున్నాం. మొన్నీమధ్య బాలీవుడ్సినిమా ‘రామాయణ’ను ప్రకటించిన తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుంది. దానికంటే భారీగా మా సినిమాను ప్రకటిస్తామని చెప్పారు నాగవంశీ.
అందుకే తమ సినిమా ప్రకటనను కొన్ని రోజులు ఆపామని తెలిపారు. తారక్ – త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది మధ్యలో సినిమానుప్రారంభించాలని అనుకుంటున్నామని నాగవంశీ చెప్పారు. ఇక త్రివిక్రమ్ – వెంకటేశ్ సినిమా ఆగస్టు నుండి ప్రారంభమవుతుందని, ఆ సినిమా పూర్తయిన తర్వాత తారక్ సినిమా పనులు మొదలవుతాయని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే నాగవంశీ ప్లాన్స్ భారీగానే ఉన్నాయని అర్థమవుతోంది. చూద్దాం అనౌన్స్‌మెంట్ అయ్యాక ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో.