జూన్ 1 నుండి థియేటర్లు బంద్ చేస్తున్నట్లు కొద్దిరోజుల నుండి ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర ఉండనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ సమావేశం ఏర్పాటు చేసి.. థియేటర్ బంద్ వెనుక ఉన్న ఎగ్జిబిటర్ల కుట్రను బహిర్గతం చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ఉంటే.. కావాలనే థియేటర్లు బంద్ చేయాలనే కుట్ర జరిగిందని కూడా చాలా మంది ఆరోపించారు.
కేవలం నలుగురు వ్యక్తుల కారణంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు రింగ్ అయ్యి థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చినట్టు మంత్రి దుర్గేష్ సిద్ధమయ్యారు… హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌తో మాట్లాడి విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పుడు థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. విషయం ముదిరి పోకుండా ఛాంబర్ లో (Telugu Film Chamber) పెద్దలు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘ జూన్ 1 నుండి థియేటర్ల బంద్ లేదని..!
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమై.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో ‘థియేటర్ల బంద్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశం తప్పుదోవ పట్టిందని’ … ఇక్కడ ఎలాంటి సమస్య వచ్చినా.. సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఛాంబర్ (Telugu Film Chamber) ఉందని.. ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించుకుని అనుకూలమైన నిర్ణయాలు తీసుకోబోతున్నామని’ ఛాంబర్ పెద్దలు తెలిపారు. సో ఈ ఇష్యు ఇక్కడితో సార్ట్ అవుట్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు.