Telugu heros : ఐకానిక్ టైటిల్స్ పెట్టుకొని హిట్ కొట్టిన హీరోలు వీళ్ళే..!
- January 21, 2026 / 06:01 PM ISTByFilmy Focus Desk
బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు క్రియేట్ చేసే మేనియా అంత ఇంత కాదు. ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరోలు కొన్ని సార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒకప్పుడు సూపర్ హిట్ అయిన ఎవర్ గ్రీన్ ఐకానిక్ చిత్రాల పేర్లు మళ్ళీ తెర మీదకి టైటిల్స్ గా రిపీట్ చేస్తుంటారు యువ హీరోలు. కొంత మంది తమ ఫేవరేట్ హీరోల చిత్రాల పేర్లు కూడా పెట్టుకోవటం మన తెలుగు చిత్ర పరిశ్రమలో చూస్తూనే ఉంటాం. అయితే ఈ సినిమా టైటిల్స్ వల్ల వచ్చే హైప్ కంటే, ఆ ముందరి చిత్రాలు విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉండటం ప్రస్తుతం అవే పేర్లతో రిలీజ్ అయ్యే సినిమాలు అంతటి హైప్ అందుకోలేకపోతే పూర్తి డిజాస్టర్ గా నిలుస్తాయి. ఇలా ఆ పేర్లతో వచ్చే లాభం కంటే రిస్క్ ఏ ఎక్కువ అని ఇండస్ట్రీ పెద్దల వాదన.
Telugu heros
అయితే ఇలా రీసెంట్ టైమ్స్ లో తెలుగులో ఐకానిక్ టైటిల్స్ తో వచ్చి హిట్ కొట్టిన యంగ్ హీరో శర్వానంద్. 2026 సంక్రాంతి బరిలో ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో బరిలో దిగి అద్భుతమైన హిట్ టాక్ సంపాదించుకున్నాడు శర్వా. ఈ మూవీలో శర్వా సరసన సంయుక్త & సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ టైటిల్ తో ఇంతకు ముందు బాలయ్య బాబు ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెల్సిందే. ఆ పేరును నిలబెడుతూ శర్వా మంచి హిట్ కొట్టి చూపించాడు. ఇంతకు ముందు మెగా ఫ్యామిలీ నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , హీరోయిన్ రాశిఖన్నా జంటగా ‘తొలిప్రేమ’ అనే మూవీ తో మంచి హిట్ కొట్టాడు. ఆ ‘తొలిప్రేమ’ టైటిల్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకానిక్ చిత్రాల నుంచి తీసుకుని హిట్ కొట్టి మెగా అభిమానుల పరువు నిలబెట్టాడు వరుణ్. ఇలా ఐకానిక్ టైటిల్స్ పెట్టుకొని హిట్ కొట్టి ఆ సినిమా పేర్లకు న్యాయం చేసారు ఈ యువ హీరోలు.











