టాలీవుడ్ తో పాటు మిగిలిన భాషల్లో కూడా కొత్త సినిమాలను ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. జనవరిలో సంక్రాంతి సినిమాల సందడి తరువాత ఒక్కసారిగా బాక్సాఫీస్ డల్ అవుతుంది. రిపబ్లిక్ డే వీకెండ్ లో కాస్త సందడి కనిపిస్తుంది. ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద సరైన సినిమాలు కనిపించవు. పరీక్షల సమయం కాబట్టి స్టూడెంట్స్ అంతా ప్రేపరేషన్స్ లో ఉంటారు. సినిమాలకు సరైన కలెక్షన్స్ ఉండవు. ముఖ్యంగా ఫిబ్రవరి సగం నుంచి మార్చి మూడో వారం వరకు డల్ గానే సాగుతుంది.
ఆ సమయంలో చిన్నా చితకా సినిమాలు తప్ప పెద్ద సినిమాలేవీ రావు. అయితే కరోనా తరువాత స్టోరీ మొత్తం మారిపోయింది. గత రెండేళ్లలో ఫిబ్రవరిలో కూడా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించింది. ఈసారి కూడా ఫిబ్రవరి నెలపై టాలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. ఆ నెలలో ఫుల్ రష్ చూడబోతున్నాం. నవంబర్, డిసెంబర్ నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలను కూడా వాయిదా వేసి మరీ ఫిబ్రవరి విడుదలకు ఫిక్స్ చేస్తున్నారు.
సమంత నటించిన ‘శాకుంతలం’తో పాటు ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ కూడా డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి వాయిదా వేశారు. వీటితో పాటు కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమా కూడా ఫిబ్రవరిలోనే రానుంది. అలానే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు.
సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుని వాయిదా వేసిన ‘ఏజెంట్’ కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు ఫిబ్రవరి రేసులోకి రానున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి స్లాట్స్ మొత్తం ఇప్పటినుంచే ఫిల్ చేసేలా ఉన్నారు.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!